నరేంద్ర మోదీ ప్రధాని పదవీ చేపట్టి ఏడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా.. సేవాహి సంఘటన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని.. మోత్కూరు, అడ్డగుడూరు, తిర్మలగిరి, నాగారం, అర్వపల్లి గ్రామాల్లో పర్యటించిన భాజపా నేతలు కరోనా బాధితులను పరామర్శించారు. పాత్రికేయులకు 20 కిలోల బియ్యం పంపిణీ చేశారు. కొవిడ్ విపత్కర పరిస్థితుల్లో విలేకరులు ప్రతి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తున్నారని తెలిపారు.
కరోనా చికిత్సను రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య శ్రీ లో చేర్చేంతవరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. కరోనా మహమ్మారికి బలైన కుటుంబాల్లోని పిల్లలను కేంద్ర ప్రభుత్వం అక్కున చేర్చుకుంటుందని అన్నారు.
- ఇదీ చూడండి: మంత్రి చెప్పినా ఆ అభాగ్యులకు న్యాయం జరగలే...!