వర్షా కాలం వస్తున్న దృష్ట్యా... అంటువ్యాధులు ప్రబలకుండా ప్రజలు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ సూచించారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి, మోత్కూరులో పట్టణ ప్రగతిలో భాగంగా సమగ్ర పారిశుద్ధ్య కార్యక్రమాలను ఎమ్మెల్యే ప్రారంభించారు.
వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని పట్టణాలు, పల్లెల్లో పారిశుద్ధ్యంపై అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. అంటూ వ్యాధులు ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉన్నందున... ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు. వేడిచేసిన నీటిని తాగాలని సూచించారు.