సూర్యాపేట జిల్లా నాగారం పోలీస్ సర్కిల్ కార్యాలయంలో... బాలల హింసపై గోడపత్రిక ఆవిష్కరించారు. నేటి సమాజంలో బాలలపై మానసిక, శారీరక, లైంగిక వేధింపులు జరగడం హేయమైన చర్య అని సీఐ తుల శ్రీనివాస్ అన్నారు. దీన్ని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలన్నారు.
బాల బాలికలు ఆపద సమయంలో ఉన్నట్లయితే 100 డయల్‌కు ఫోన్ చేసి సమాచారం ఇస్తే వెంటనే రక్షణ చర్యలు చేపడతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా బాలల సంరక్షణాధికారి భూక్యా నాగరాజు, ఐసీడీఎస్ సూపర్వైజర్, ఏఎస్సై వెంకటేశ్వర్ రెడ్డి, బాలల సంరక్షణ విభాగం ప్రతినిది డి. కిరణ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.