సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీలో పట్టణ ప్రగతిలో భాగంగా పారిశుద్ధ్య వారోత్సవాలు నిర్వహించారు. 7, 11 వార్డుల్లో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను పురపాలక ఛైర్పర్సన్ రజిని రాజశేఖర్ పరిశీలించారు. అనంతరం తడి, పొడి చెత్త బుట్టలను కాలనీవాసులకు అందజేశారు.
వానాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశమున్నందున ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని రజినీ రాజశేఖర్ సూచించారు. ఈ కార్యక్రమంలో తిరుమలగిరి మున్సిపల్ కమిషనర్ కె.ఉమేష్ చారి, వైస్ ఛైర్మన్ ఎన్. రఘునందన్ రెడ్డి, కౌన్సిలర్లు వై.నరేష్, సరళ పాల్గొన్నారు.
- ఇదీ చూడండి : జిల్లాల్లోనూ వేగంగా విస్తరిస్తున్న కరోనా