ETV Bharat / state

పోలీస్ ఉద్యోగం వచ్చింది..మృత్యువు వెంటాడింది.. - రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

ఆ ఇద్దరూ కొద్ది రోజుల్లో పోలీసు ఉద్యోగాల్లో చేరాల్సి ఉంది. కానీ..రోడ్డుప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. సూర్యాపేట జిల్లా తాల్లసింగారం గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు విగతజీవులుగా మారారు.

road-accident-in-suryapet-district
రోడ్డుప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి
author img

By

Published : Dec 18, 2019, 9:11 AM IST

పోలీస్​ ఉద్యోగం వచ్చిందని ఎంతో మురిసిపోయారు. మరికొద్ది రోజుల్లో శిక్షణకు వెళ్లాలని అన్నీ సిద్దపర్చుకున్నారు. కానీ అనుకోకుండా వారిని రోడ్డు ప్రమాదం కబళించింది. వారి కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపింది. నూతనకల్ మండలం తాల్ల సింగారం గ్రామానికి చెందిన జటంగి నరేష్ , పంతంగి వెంకటేశ్వర్లు అనే ఇద్దరు వ్యక్తులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.

రోడ్డుప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి

సింగారం గ్రామం నుంచి సూర్యాపేట వైపు ద్విచక్రవాహనంపై వారు వెళ్తుండగా నెమ్మికల్ సమీపంలో ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా... మరో యువకుడు జగదీశ్​కి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గాయపడిన జగదీశ్​ని సూర్యపేట ఆస్పత్రికి తరలించారు.

రోడ్డు ప్రమాదానికి గురైన ద్విచక్ర వాహనదారులు, కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి కూడా సింగారం గ్రామానికే చెందిన వారు కావడం విస్మయం కలిగిస్తోంది. స్థానికుల సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

ఇదీ చూడండి: చటాన్‌పల్లిలో కిడ్నాప్​ అయిన చిన్నారి లభ్యం

Intro:Slug :. TG_NLG_23_17_ACCIDENT_TWO_DEATHS_AV_TS10066

TG_NLG_23_17_ACCIDENT_TWO_DEATHS_01_AV_TS10066

రిపోర్టింగ్ & కెమెరా : బి. మారయ్య , ఈటీవీ , కం, సూర్యపేట.

( ) కష్ట పడి చదివారు. పోలీస్ ఉద్యోగం సాధించారు. బంగారు భవిష్యత్తుకు ప్రణాళికలు వేసుకుంటూ గడుపుతున్నారు. మరి కొద్ది రోజుల్లో శిక్షణకు వెళ్లాల్సిన సమయంలో రోడ్డు ప్రమాదం వారిని కభళించింది. వారి కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపింది.
నూతనకల్ మండలం తాళ్ల సింగారం గ్రామానికి చెందిన జటంగి నరేష్ , పంతంగి వెంకటేశ్వర్లు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. సింగారం గ్రామం నుండి సూర్యపేట వైపు వెళ్తుండగా వీరు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహానం ఆత్మకూర్. ఎస్ మండలం నెమ్మికల్ సమీపంలో ఎదురుగా వస్తున్న కారు , ద్విచక్ర వాహనం ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ సంఘటనలో ద్విచక్ర వాహనం పై ప్రయాణిస్తున్న వెంకన్న , నరేష్ అక్కడికక్కడే మృతి చెందగా... ఇదే ద్విచక్ర వాహనం పై ప్రయాణిస్తున్న మరో యువకుడికి గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని సూర్యపేట కు తరలించారు. రోడ్డు ప్రమాదానికి గురైన ద్విచక్ర వాహనదారులు , కారు లో ప్రయాణిస్తున్న వ్యక్తి కూడా సింగారం గ్రామానికే చెందిన వారు కావడం విస్మయం కలిగిస్తుంది. మృతులు మరి కొద్ది రోజుల్లో పోలీస్ శిక్షణకు వెళ్లాల్సి ఉండగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం ఇరువురి కుటుంబాల్లో తీరని నష్టాన్ని మిగిల్చింది.
Body:MConclusion:K
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.