ETV Bharat / state

గుట్టలకు సైతం పట్టాలిస్తున్న రెవెన్యూ అధికారులు! - పట్టా అయిన భూముల మీద రైతుబంధు వసూలు

ఎన్ని విమర్శలు వచ్చినా కొంతమంది రెవెన్యూ సిబ్బంది తీరు మారడం లేదు. మేమింతే, మారమంతే అన్నరీతిలో... ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని కృష్ణపట్టి ప్రాంతంలో.. వివాదాస్పద భూములకు అడ్డగోలుగా పట్టాలు సృష్టిస్తున్నారు. ఇప్పటికే పలువురిపై వేటుపడ్డా... మిగతా వారిలోనైనా చలనం కనిపించడం లేదు.

Revenue officials are also patrolling the hills at suryapet district
గుట్టలకు సైతం పట్టాలిస్తున్న రెవెన్యూ అధికారులు!
author img

By

Published : Sep 3, 2020, 1:59 PM IST

కాసులకు కక్కుర్తి పడుతున్న కొందరు రెవెన్యూ అధికారులు... గుట్టలకు సైతం పట్టాలు సృష్టించి అక్రమార్కుల పరం చేస్తున్నారు. అలా పట్టా అయిన భూముల మీద రైతుబంధు పేరిట... కోట్లు కొల్లగొడుతున్నారు. కృష్ణపట్టి ప్రాంతాలైన దేవరకొండ, హుజూర్​నగర్ నియోజకవర్గాల్లో.. ఈ తంతు ఎక్కువగా కొనసాగుతోంది. ఈ మధ్యకాలంలో సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలోని వివాదాస్పద భూములకు సంబంధించి... ఆ మండల పాత, ప్రస్తుత తహసీల్దార్లు ఇద్దరూ సస్పెండ్ అయ్యారు. ఇలాంటి ఘటనలు అటు దేవరకొండలోనూ తరచుగా చోటుచేసుకుంటున్నాయి.

దొంగ పట్టాలు సృష్టించి

అటవీ, రెవెన్యూ శాఖల మధ్య వివాదాస్పదంగా మారిన భూములు... రాష్ట్రంలోనే అత్యధికంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నాయి. దాదాపు 50 వేల ఎకరాలు వివాదంలో ఉండగా... సరైన సమయంలో సర్వే నిర్వహించకపోవడం, కొన్నింటికి అసలు రికార్డులే లేకపోవడం అక్రమార్కులకు వరంగా తయారైంది. కృష్ణపట్టి ప్రాంతంలో కొందరు రెవెన్యూ సిబ్బంది సహకారంతో... పారిశ్రామిక వేత్తలు, రాజకీయ నాయకులు లబ్ధి పొందుతున్నారు. ఇప్పటికే 15 వేల ఎకరాల ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమయ్యాయి. దేవరకొండ డివిజన్లోని చందంపేట మండలం రేకులగడ్డ, పొగిళ్ల, కంబాలపల్లిలో... గుట్టలుగా కలిగిన 7 వేల ఎకరాల ప్రభుత్వ భూమిలో 3 వేల ఎకరాలకు దొంగ పట్టాలు సృష్టించారని గుర్తించిన అధికారులు.. వాటిని రికార్డుల్లోనుంచి తొలగించారు. దొంగ పట్టాలు సృష్టించిన 10 మంది రెవెన్యూ అధికారులను గతేడాది సస్పెండ్ చేశారు. అందులో నలుగురు తహసీల్దార్లు, ఇద్దరు రెవెన్యూ ఇన్​స్పెక్టర్లు, నలుగురు వీఆర్వోలున్నారు. మిగిలిన 4 వేల ఎకరాల్లోనూ ప్రస్తుతం సర్వే కొనసాగుతోంది. అటు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గంలోనూ భూదందా కొనసాగుతోంది.

కోట్ల విలువైన భూములు

రాష్ట్రంలోనే అత్యధిక సిమెంటు పరిశ్రమలున్న హుజూర్ నగర్ నియోజకవర్గంలో.. వందలాది ఎకరాల సర్కారీ భూముల్ని మైనింగ్ నిమిత్తం తీసుకుని వాటిని తమ భూముల్లో కలుపుకొంటున్నారు పారిశ్రామికవేత్తలు. ఖనిజ, రెవెన్యూ, అటవీశాఖల అధికారుల్ని మచ్చిక చేసుకుని... కోట్ల విలువైన భూముల్ని చెరపడుతున్నారు. ఇటీవలే ఆ ప్రాంతంలో ఓ రెవెన్యూ ఇన్​స్పెక్టర్... రూ.10 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. ఇక మఠంపల్లి మండలంలోనూ భూబాగోతం చోటుచేసుకుంది. పెదవీడు రెవెన్యూ పరిధిలోని సర్వే సంఖ్య 540లో... 6 వేల 7 వందల ఎకరాల భూమి ఉంది. గుర్రంబోడు తండా, రామచంద్రాపురం తండా, భోజ్య తండా, మంచ్యా తండా, మిగడం పాడు, కృష్ణతండాలకు చెందిన వందలాది భూములు అందులో ఉన్నాయి.

అడ్డగోలుగా మ్యుటేషన్

క్షేత్రస్థాయిలో సమగ్ర సర్వే చేయకపోవడం వల్ల నిర్వాసితుల భూములేవో, అటవీ భూములేవో తెలియక ఏళ్లుగా వివాదం కొనసాగుతూనే ఉంది. దీన్ని ఆసరాగా చేసుకున్న తహసీల్దార్లు... స్థానికంగా ఉన్న సిమెంటు పరిశ్రమలతోపాటు ప్రైవేటు వ్యక్తులకు పట్టాలు చేశారు. ఇదే అదనుగా ఓ ప్రైవేటు కంపెనీ.. 480 ఎకరాలు తాము కొన్నట్లు పట్టాలు సృష్టించుకుంది. 12 మంది వీర్వోలు, ఆరుగురు సర్వేయర్లతో బృందాన్ని ఏర్పాటు చేసిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి...ప్రభుత్వ భూముల్ని లెక్క తేల్చారు. వందల ఎకరాలకు అడ్డగోలుగా మ్యుటేషన్ చేసినట్లు నిర్ధరించి.. మఠంపల్లి తహసీల్దార్ వేణుగోపాల్​తోపాటు గతంలో అక్కడ పనిచేసి, ఇపుడు గరిడేపల్లి తహసీల్దార్ గా ఉన్న చంద్రశేఖర్​ను... సస్పెండ్ చేశారు.

ఇలా వేల కోట్లు విలువ చేసే భూములు అన్యాక్రాంతమవడం.. ఉమ్మడి నల్గొండ జిల్లాలో సాధారణంగా మారింది. ఇప్పుడిప్పుడే ఇలాంటి వాటిపై దృష్టి సారిస్తున్న జిల్లా ఉన్నతాధికారులు.. వివాదాస్పద భూములపై సర్వేకు ఆదేశాలిస్తున్నారు.

ఇదీ చూడండి : 'భూమికి భూమి ఇవ్వండి.. లేదంటే పరిహారమైనా ఇప్పించండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.