ETV Bharat / state

E-Pass : నేటి నుంచి ఈ-పాస్​ లేకుండానే అనుమతి - ramapuram check post is lifted in suryapet district

రాష్ట్రంలో లాక్​డౌన్ ఎత్తివేయడం వల్ల అంతర్రాష్ట సరిహద్దుల్లోని చెక్​పోస్టులను పోలీసులు తొలగించారు. నేటినుంచి ఇతర రాష్ట్రాల ప్రజలకు తెలంగాణలో రావడానికి ఈ-పాస్ (E-Pass ) అవసరం లేదని స్పష్టం చేశారు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపూర్ చెక్​పోస్టును ఎత్తివేశారు.

check post, ramapuram check post, check post is lifted
చెక్​పోస్టు, రామాపురం చెక్​పోస్టు, చెక్​పోస్టు ఎత్తివేత
author img

By

Published : Jun 20, 2021, 9:13 AM IST

కరోనా కట్టడికి ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి ఎవరూ రాకుండా ఉండేందుకు రాష్ట్ర సరిహద్దుల్లో చెక్​పోస్టులు ఏర్పాటు చేశారు. లాక్​డౌన్ ముగియడం వల్ల ఇప్పుడు ఆ చెక్​పోస్టులను ఎత్తివేస్తున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురం క్రాస్​రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన అంతర్​రాష్ట్ర చెక్​పోస్టును పోలీసులు ఎత్తివేశారు. ఇవాళ్టి నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే వాహనాలు ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండానే రాష్ట్రంలోకి రాకపోకలు సాగించవచ్చని తెలిపారు.

తెలంగాణలో లాక్​డౌన్ విధించిన రోజు నుంచి పోలీసు, రెవెన్యూ, వైద్య సిబ్బంది చెక్​పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్నారు. ఈ-పాస్ ఉన్న వాహనాలను మాత్రమే అనుమతించడం వల్ల చాలా మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తాజా ఉత్తర్వులతో ఆంధ్రా నుంచి వచ్చే వాహనాలు నేరుగా తెలంగాణలోకి అనుమతిస్తున్నారు. రామాపురం క్రాస్ రోడ్డు వద్ద నిత్యం వందల సంఖ్యలో వాహనాలకు పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈపాస్ లేని సుమారు 30 వేలకు వాహనాలను వెనక్కి పంపించారు. తెలంగాణ ప్రభుత్వం లాక్​డౌన్ ఎత్తివేయడం వల్ల ఆంధ్రా నుంచి భారీగా ప్రయాణికులు హైదరాబాద్ తదితర ప్రాంతాలకు ప్రయాణమయ్యారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.