ETV Bharat / state

నో ఎల్ఆర్​ఎస్​-నో టీఆర్​ఎస్​ నినాదంతో ముందుకు పోతాం: ఉత్తమ్ - సంతకాల సేకరణ కార్యక్రమంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నాయని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. కేంద్ర నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సూర్యాపేట జిల్లా కోదాడలో సంతకాల సేకరణ చేపట్టారు. నవంబర్ 14న రాష్ట్రపతికి సమర్పించనున్నట్టు వెల్లడించారు.

pcc president utham kumar reddy fire on state and central government
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను మోసాగిస్తున్నాయి: ఉత్తమ్
author img

By

Published : Nov 9, 2020, 5:10 PM IST

Updated : Nov 9, 2020, 5:25 PM IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రైతును మోసం చేస్తున్నాయని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ... సూర్యాపేట జిల్లా కోదాడలో చేపట్టిన సంతకాల సేకరణకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ప్రతి గ్రామంలోని రైతుల సంతకాలు సేకరించి... రాష్ట్రపతికి సమర్పిస్తామన్నారు. కేంద్ర చట్టాలకు వ్యతిరేకంగా అసెంబ్లీ తీర్మానం చేయలేదని కేసీఆర్​ను విమర్శించారు.

కాంగ్రెస్ పాలిత రాష్టం పంజాబ్​లో కేంద్ర వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులకు అనుకూల చట్టం చేసిందని గుర్తుచేశారు. సన్నరకం వరి సాగు చేయాలని రైతులను దారి మళ్లించిన ముఖ్యమంత్రి, ఇప్పుడు మద్దతు ధర ఇవ్వలేక చేతులు ఎత్తేశాడని ఏద్దేవా చేశారు. తక్షణమే వరికి రూ. 2,500ల మద్దతు ధర ప్రకటించాలని, పత్తిని రూ.5వేలకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఎల్​ఆర్​ఎస్​ పేరుతో లక్షల కోట్లను పేదల నుంచి దండుకుంటున్నట్టు ఆవేదన వ్యక్తం చేశారు. నో ఎల్ఆర్​ఎస్​-నో టీఆర్​ఎస్​ నినాదంతో కాంగ్రెస్ ముందుకు పోతుందన్నారు.

నరేంద్ర మోదీ గారి భాజపా ప్రభుత్వం అప్రజాస్వామికంగా పార్లమెంటులో ఆమోదింపజేసుకున్న రైతు వ్యతిరేక చట్టాలను వ్యతిరేకిస్తూ... ఆ చట్టాల వల్ల రైతులకు నష్టం జరుగుతుంది. మద్ధతు ధర ఎంఎస్​పీ సిస్టంను రద్దు చేసేందుకు భాజపా ప్రభుత్వం చేస్తుందని ఈ చట్టాలను వ్యతిరేకిస్తున్నం. కార్పొరేట్​ సంస్థలకు, అదానీలకు, అంబానీలకు మేలు చేయడానికే ఈ కొత్త చట్టాలు తీసుకొచ్చిర్రు. ఈ చర్యను వ్యతిరేకిస్తూ... భారత రాష్ట్రపతిని నవంబరు 14న సోనియా గాంధీ గారు కలిసి ఈ సంతకాలను సమర్పించనున్నారు. రాష్ట్రంలో కేసీఆర్​ నాయకత్వంలోని తెరాస ప్రభుత్వంలో రైతులకు తీవ్ర నష్టం జరుగుతోంది. ఇటీవల భారీ వర్షాలతో నష్టపోయిన 13 లక్షల ఎకరాలకు పరిహారం ఇవ్వలేదు, పంట బీమా లేదు. సన్నరకం వరి, పత్తిని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం.

- ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను మోసగిస్తున్నాయి: ఉత్తమ్

ఇదీ చూడండి: సీఈసీ ఆరోడాపై సుప్రీంలో కేసు

Last Updated : Nov 9, 2020, 5:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.