సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని మద్దిరాల మండలంలో వ్యవసాయ అధికారులు.. విత్తనాలు, ఎరువుల దుకాణాల్లో తనిఖీలు చేశారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాలని, ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎరువులను ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు మాత్రమే అమ్మాలని.. అధిక ధరలకు అమ్మితే దుకాణదారులపై చర్యలు తీసుకుంటామన్నారు.
ఇదీ చదవండి: ఈటల ఓఎస్డీకి కరోనా... గత 2రోజులుగా ఆయనతోనే మంత్రి