సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్‌లోని 7 వార్డులో 150 మంది నిరుపేదలకు కూరగాయలు, నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. నటుడు జూ.ఎన్టీఆర్ ఆదేశాల మేరకు ఎన్టీఆర్ స్టేట్ ఫ్యాన్స్ కన్వీనర్ వేముల నర్సయ్య సొంత ఖర్చులతో వంటింటి సామగ్రి పంపిణీ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన లాక్ డౌన్‌ను గౌరవించి ప్రతి ఒక్కరూ ఇళ్లకే పరిమితం కావాలని సూచించారు. ఇళ్ల విడిచి ఎవరూ బయటకు రావొద్దని కోరారు. తామంతా ఎన్టీఆర్ అభిమానులుగా సమాజానికి ఉపయోగపడే పనులను ఆచరిస్తామని స్పష్టం చేశారు.
ఇవీ చూడండి : నిత్యావసరాలను అక్రమంగా నిల్వ చేస్తే ఏడేళ్లు జైలు!