సూర్యాపేట జిల్లా పాలకీడు మండలం నాగిరెడ్డి గూడెం గ్రామంలో కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల సమస్యల నిలయంగా మారింది. ఆరు నుంచి తొమ్మిదో తరగతి వరకు విద్యార్థులు 200కు పైగా ఉన్నారు. పాఠశాలలో కనీస సౌకర్యాలు లేక వారంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీసం సొంత భవనం కూడా లేక .... అద్దె భవనాల్లో నానా అవస్థలు పడుతున్నారు.
కనీస వసతులు లేవు
విద్యార్థులు చదువుకోడానికి రెండు గదులు మాత్రమే ఉన్నాయి. హాస్టల్లో ఉండటానికి భవనం లేక.. గ్రామపంచాయతీ కార్యాలయంలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. పంచాయతీ కార్యాలయం సరిపోక ఉన్న తరగతి గదుల్లోనే సామాన్లు పెట్టుకుని ఉంటున్నారని తెలిపారు. పాఠశాల ఊరు చివర ఉండటం వలన ప్రహరి గోడ లేకపోవడం వల్ల విద్యార్థులు భయభ్రాంతులకు గురవుతున్నారు.
పరిష్కరించండి
పాఠశాలలో ఉన్న రెండుగదులు కూడా శిథిలావస్థకు చేరాయి. తలుపులు, కిటికీలు లేక వర్షం పడినప్పుడు తడవాల్సిన పరిస్థితి. అంతే కాకుండా కోతుల బెడద కూడా ఎక్కువగా ఉందని వాపోతున్నారు. స్నానాల గదులు, మరుగుదొడ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. పాములు, తేళ్లు పాఠశాలలోకి వస్తున్నాయని... వెంటనే మా సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులు కోరుతున్నారు.
ఇవీ చూడండి: ఆట రూటు మారుతోంది... బాల్యం బంధీ అవుతోంది!