సూర్యాపేట జిల్లా పాలవరం గ్రామ ఎంపీటీసీ రిజర్వేషన్లలో గందరగోళం నెలకొంది. మొదట ఎంపీటీసీ రిజర్వేషన్‌ను బీసీ మహిళకు కేటాయించగా తర్వాత జనరల్‌గా మార్చారు. మళ్లీ తదుపరి సవరణలో జనరల్ మహిళగా మార్చారని పాలవరం గ్రామం మహా కూటమి నాయకులు వాపోతున్నారు. దీనికి ఎంపీడీవో బాధ్యత వహించి పరిష్కారం చూపాలని విన్నవించుకున్నారు. అధికారులు, తెరాస నాయకులు కలిసి బలహీన వర్గాల స్థానాన్ని ఉన్నత వర్గాలకు కట్టబెట్టాలని చూస్తున్నారన్నారని ఆరోపించారు. కోదాడ డీఎస్పీ సుదర్శన్ రెడ్డి ఆందోళనకారులను శాంతింపజేశారు.
ఇవీ చూడండి: నల్గొండలో మూడో దశ నామినేషన్లు షురూ