సూర్యాపేట జిల్లా హుజుర్ నగర్ నియోజకవర్గ ప్రజలకు ఫోన్ ద్వారా టీపీసీసీ అధ్యక్షుడు, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారని టీపీసీసీ జాయింట్ సెక్రటరీ అజీజ్ పాషా పేర్కొన్నారు. కరోనా కారణంగా పరిమిత సంఖ్యలోనే హుజూర్ నగర్ ఉస్మానియా మసీసదులో ప్రత్యేక ప్రార్థనలు చేసుకున్నట్లు తెలిపారు. మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటిస్తూనే పండగ జరుపుకున్నట్లు అజీజ్ పాషా వివరించారు.
అల్లా దయవల్ల కరోనా వైరస్ పూర్తిగా నాశనమైపోవాలని ప్రార్థనల్లో కోరుకున్నట్లు చెప్పారు. కుల, మత బేధాలు లేకుండా ప్రజలందరూ కలిసి ఉండాలని అన్నారు. విశ్వ మానవ సౌభ్రాతృత్వానికి ప్రతీకగా ఏర్పడిందే బక్రీద్ పండగని అజీజ్ పాషా తెలిపారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు ఎండీ అజీజ్ పాషా, మన్సూర్ అలీ, బిక్కన్ సాహెబ్, రహమతుల్లా తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: రాష్ట్రంలో కొత్తగా 2,083 కరోనా పాజిటివ్ కేసులు