సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో స్వామి వివేకానంద 158వ జయంతి ఘనంగా నిర్వహించారు. పీసీసీ అధ్యక్షుడు, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు. చికాగోలో నిర్వహించిన ప్రపంచ మహాసభల్లో వివేకానందుడు చేసిన ప్రసంగం విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. అనంతరం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా... ఓ హోటల్లో అల్పాహారం చేస్తూ కార్యకర్తలతో ఉత్తమ్ ముచ్చటించారు.
ఇది చదవండి: 'సాహో' రికార్డును అధిగమించిన 'సరిలేరు నీకెవ్వరు'!