ETV Bharat / state

కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి దాతృత్వం.. అనాథ  పిల్లలకు అభయహస్తం!

చిన్న వయస్సులోనే తల్లిదండ్రులను కోల్పోయి.. అనాథలయిన ముగ్గురు చిన్నారులకు భువనగిరి ఎంపి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి అండగా నిలిచారు. మీకు నేనున్నా అంటూ అభయహస్తం అందించారు. తక్షణ సహాయం రూ.50 వేలు అందించి.. ముగ్గురు అమ్మాయిలకు లక్షా యాభైవేల రూపాయలు ఫిక్స్​డ్​ డిపాజిట్​ చేసి.. వారికి ప్రతీ నెల రూ.2వేల రూపాయలు అందిస్తానని ప్రకటించారు. వారి చదువు సంధ్యల బాధ్యత కూడా తనదే అని ప్రకటించి తన పెద్ద మనసు చాటుకున్నారు.

MP Komatireddy Venkat Reddy helps Poor childrens who loss their parents
కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి దాతృత్వం.. అనాథ  పిల్లలకు అభయహస్తం!
author img

By

Published : Aug 3, 2020, 9:27 PM IST

సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం ముకుందాపురం గ్రామంలో తల్లిదండ్రులు చనిపోయి.. చిన్న వయస్సులోనే అనాథలైన ముగ్గురు అమ్మాయిలకు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి అండగా నిలిచారు. తక్షణం సాయం కింద యాభైవేల రూపాయలు అందిస్తూ, త్వరలో ముగ్గురు అమ్మాయిల పేరు మీద లక్షాయాభై వేల రూపాయలు ఫిక్స్​డ్ డిపాజిట్ చేయనున్నట్లు తెలిపారు. ప్రతి నెలకు ఖర్చుల నిమిత్తం రూ.2 వేల రూపాయలు అందించనున్నట్లు ప్రకటిస్తూ, పిల్లల చదువుల బాధ్యతను కూడా తానే చూసుకుంటనని హామీ ఇచ్చి మరోసారి ఆయన తన ఉదారతను చాటుకున్నారు.

పదిరోజుల క్రితం యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరులో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు కూడా వెంకట్​రెడ్డి అండగా నిలిచి ఆర్థిక సహాయం చేశారు. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులను మద్దిరాల మండల కాంగ్రెసు నాయకులు పరామర్శించి ధైర్యం చెప్పారు.. పిల్లల మేనమామ మంద రాయప్పతో ఎంపీ కోమటిరెడ్డితో ఫోన్​లో మాట్లాడించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మార్తా కృష్ణమూర్తి, ఉమ్మడి నూతనకల్ కిసాన్ సెల్ అధ్యక్షుడు వాసు రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, విజయ్ కుమార్, బొబ్బిలి వెంకన్న, పచ్చిపాల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి : పీఎస్​కు వచ్చే ఫిర్యాదు పేపర్లను ఇస్త్రీ చేస్తున్న పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.