మతాల మధ్య చిచ్చు పెట్టి, ప్రశాంత వాతావరణాన్ని చెడ గొట్టాలని చూసే నాయకులను ప్రజలంతా గమనిస్తున్నారని... ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి తెలిపారు. అలాంటి వారికి తగిన బుద్ధి చెప్తారని అన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
అన్ని వర్గాల ప్రజలను సమానంగా చూసే సీఎం కేసీఆర్ వైపే ప్రజలందరూ చూస్తున్నారని అన్నారు. ఎమ్మెల్సీగా తెరాస అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపు ఖాయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు ఆయనకే వేయాలని పట్టభద్రులను కోరారు.
ఇదీ చదవండి: కొండగట్టులో రామకోటి స్తూపానికి భూమిపూజ