సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రంలో తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. మున్సిపాలిటీ పరిధిలోని 2, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15వ వార్డుల్లో కోటి 4 లక్షల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు.
తండాలను గ్రామ పంచాతీలుగా మార్చి అభివృద్ధి చేసిన ఘనత కేవలం తెరాస దేనని ఎమ్మెల్యే గాదిరి కిషోర్ అన్నారు. కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ మూల అశోక్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ పోతరాజు రజిని, రాజశేఖర్ వైస్ చైర్మన్ సంకేపల్లి రఘునందన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: తెరాస, ఎమ్మెల్యే పదవికి ఈటల రాజేందర్ రాజీనామా