తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన చిన్నారులను తుంగతుర్తి ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్ అండగా నిలిచారు. సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం ముకుందాపురంలో నిరుపేద కుటుంబానికి చెందిన మీసాల పర్షరాములు, అనిత దంపతులు కాగా... వీరికి సాద, నవ్య, దివ్య ముగ్గురు సంతానం. గతంలో అనిత అనారోగ్యంతో మరణించగా... పరుషరాములు ఇటీవలే చనిపించారు.
తల్లిదండ్రులను కోల్పోయి ముగ్గురు చిన్నారులు అనాథలుగా మారిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే... బాధిత కుటుంబానికి రూ. లక్షన్నర ఆర్థిక సాయం అందించాలని తలిచారు. అట్టి నగదును సంబంధిత బ్యాంకులో ఒక్కొక్కరి పేరు మీద రూ. 50 వేల చొప్పున ఫిక్స్డ్ డిపాజిట్ చేయించి బాండ్ పత్రాలను ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. ఈ మేరకు జిల్లా రైతు బంధు సమితి కోఆర్డినేటర్ ఎస్ఏ రజాక్ సదరు చిన్నారులను పరామర్శించారు. ఇలాంటి విపత్కరమైన పరిస్థితుల్లో మనోధైర్యం కల్పించిన ఎమ్మెల్యేకు గ్రామ ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.