సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం గొండ్రియాలలో చేతన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కరోనా బాధితులకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. కష్టకాలంలో పేదలకు అండగా ఉన్న చేతన ఫౌండేషన్ను ఎమ్మెల్యే అభినందించారు.
అనంతరం ఫ్రంట్ లైన్ వారియార్లను సన్మానించి వారి సేవలను కొనియాడారు. ప్రతి పేదవాడికి నిత్యావసర సరకులు, మాస్కులు, శానిటైజర్లు, మెడికల్ కిట్లు అందజేసేందుకు కృషి చేస్తున్నామని చేతన ఫౌండేషన్ నిర్వాహకులు తెలిపారు.
ఇదీ చదవండి: L.RAMANA: సైకిల్ దిగి కారెక్కనున్న ఎల్.రమణ... రేపు వెల్లడించే అవకాశం