Minister Uttam Kumar Fires on Ration Rice Recycling Process : రేషన్ మాఫియాపై రాష్ట్ర ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంటుందని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. రేషన్ బియ్యం దారి మళ్లింపు, దుర్వినియోగంపై మంత్రి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే బియ్యం, ఇతర సేవల నాణ్యతను అంచనా వేయడానికి సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో ఓ రేషన్ దుకాణాన్ని(Ration Shop) పరిశీలించారు. గత ప్రభుత్వం అండదండలతో పలువురు నాయకులు, అధికారుల రేషన్ రీసైక్లింగ్ జరిపారని ఆరోపించారు.
Minister Uttam Kumar Reddy Inspect on Ration Shop : రేషన్ బియ్యం చాలా వ్యయంతో ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మంత్రి వెల్లడించారు. సివిల్ సప్లై కార్పొరేషన్‌పై గత ప్రభుత్వ రూ.3,300 కోట్లు అప్పు మిగిల్చిందని ఆయన తెలిపారు. ప్రతి ఏటా రేషన్ షాప్ కింద ప్రభుత్వం కొంత సబ్సిడీ అమౌంట్ ఇవ్వలేదన్నారు. గడిచిన తొమ్మిదన్నరేళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం(BRS Govt) రాష్ట్ర పౌర సరఫరాల శాఖకు ఆర్థిక సాయం అందించకపోవడం, సబ్సిడీలు చెల్లించకపోవడం, రైతుల నుంచి పాడి ప్రొక్యూర్మెంట్ కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోవడం వల్ల కార్పొరేషన్ అప్పులు రూ.56 వేల కోట్లకు చేరాయని మంత్రి ఉత్తమ్ వెల్లడించారు.
కలెక్టర్లతో రివ్యూ మీటింగ్ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి తీపి కబురు చెప్తారు : పొంగులేటి
Minister Uttam Kumar Fires on BRS : అదేవిధంగా గత ప్రభుత్వం ఈ శాఖ పట్ల తీవ్ర నిర్లక్ష్యం వహించడంతో దశాబ్ద కాలంగా కార్పొరేషన్‌కు రూ.11 వేల కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. ఇందుకుగానూ ప్రతి ఏటా సివిల్ సప్లై కార్పొరేషన్‌కు కట్టాల్సింది మూడు వేల కోట్ల వడ్డీ అని వివరించారు. కార్పొరేషన్ ఆర్థిక పరిస్థితి చాలా అధ్వాన్నంగా తయారైందని, కేసీఆర్ ప్రభుత్వం దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేషన్ నడపాలంటే ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు. ఎంతో అసమర్థత, రాజకీయ దురుద్దేశంతో సివిల్ సప్లై కార్పొరేషన్‌ను నడిపించారని దుయ్యబట్టారు.
ఒక రాజకీయ దురుద్దేశంతో ఇక్కడ స్టాకు పెట్టుకోవడానికి సరైన స్థలం లేదు. ఉన్న స్టాకు ఖరాబు అవుతుంది. కర్ణాటక, తమిళనాడు ప్రభుత్వాలు కొనుగోలు చేస్తామంటే అక్కడ కాంగ్రెస్, డీఎంకే ప్రభుత్వాలకు మంచి పేరు వస్తుందని ఇక్కడ నిల్వలు పోయినా సరే నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అమ్మటానికి నిరాకరించింది. అధికార పార్టీ అండదండలతో పెద్ద ఎత్తున రీసైక్లింగ్ రైస్ మాఫియా నడుస్తోంది. రేషన్ రైస్ ఎవ్వరైనా సరే రీసైక్లింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయి.-ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పౌరసరఫరాల మంత్రి
రేషన్ బియ్యాన్ని 70శాతం కుటుంబాలు తినడం లేదు : ఉత్తమ్‌కుమార్ రెడ్డి
బియ్యం రీసైక్లింగ్‌లో ఎవరైనా పాల్గొంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని, మిల్లర్లు లేదా రేషన్ బియ్యం రీసైక్లింగ్ చేస్తున్న ఇతర వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) కట్టుబడి ఉందని మంత్రి ఉద్ఘాటించారు. తెలంగాణ రాష్ట్రంలో బియ్యం నిల్వ పెట్టుకోవడానికి స్థలం లేదని, ఉన్న స్టాక్ ఖరాబు అవుతుందని ఆయన తెలిపారు.
Telangana Govt Takes Strict Action Against Ration Mafia : నాడు కర్ణాటక, తమిళనాడు ప్రభుత్వాలు బియ్యాన్ని కొనుగోలు చేస్తామని ముందుకొస్తే గత ప్రభుత్వం రాజకీయ కారణాలతో అమ్మలేదని మండిపడ్డారు. రేషన్ బియ్యం పాడి ప్రొక్యూర్మెంట్ వ్యవస్థ అనేది సివిల్ సప్లై డిపార్ట్మెంట్లో(Civil Supply Department) ఉన్న విషయాలను వ్యవస్థను మెరుగుపరిచే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన తెలిపారు. అదేవిధంగా పౌర సరఫరాలో ఉన్న వ్యవస్థను మొత్తాన్ని క్లీనప్ చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.
బ్యారేజీ కుంగటానికి కారణమైన ఎవ్వరిని వదిలిపెట్టేది లేదు : ఉత్తమ్
పార్టీకి నమ్మిన బంటు, ఆపత్కాలంలో ఆపద్బాంధవుడు - మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజకీయ ప్రస్థానమిదే