ETV Bharat / state

15 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి - అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి జగదీశ్​ రెడ్డి

గతంలో చేసిన మూస ధోరణి వ్యవసాయ విధానాలకు స్వస్తి పలికి నూతన విధానంలో పంటలు పండించాలని మంత్రి జగదీశ్​ రెడ్డి రైతులకు పిలుపునిచ్చారు. రైతుని రాజును చేసే లక్ష్యంతో సీఎం కేసీర్ నూతన వ్యవసాయ విధానానికి నాంది పలికారని మంత్రి అన్నారు. ప్రభుత్వం సూచించిన విధంగా నూతన విధానాలను పాటించి లబ్ది పొందాలని రైతులకు విజ్ఞప్తి చేశారు.

Minister jagadish reddy laid the foundation stone for 15 crore development projects at suryapet
15 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి
author img

By

Published : May 22, 2020, 4:41 PM IST

వ్యవసాయాన్ని పండగలా మార్చి, రైతులకు అధిక లాభాలు వచ్చేలా సీఎం కేసీఆర్ నియంత్రిత పంటల విధానాన్ని అమలు చేస్తున్నారని రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్​ రెడ్డి అన్నారు. సూర్యాపేట నియోజక వర్గంలోని పలు మండలాల్లో బీటీ రోడ్ల పనులకు మంత్రి శంకుస్థాపనలు చేశారు. ఆ పనులను గ్రామీణ, ఆత్మకూర ఎస్, చివ్వెంల, పెన్ పహాడ్ మండలాల్లో 15 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఈ వానాకాలం సీజన్​లో ప్రతి ఒక్క రైతుకి రైతు బంధు ఆర్థిక సాయం అందజేస్తామని అన్నారు.

డిమాండ్ ఉన్న పంటలు సాగు

వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిఫుణులు, అధికారుల సాయంతో సీఎం కేసీఆర్ డిమాండ్ ఉన్న పంటలు సాగు చేసేలా తెలంగాణ రైతాంగాన్ని సన్నద్దం చేస్తున్నారని పేర్కొన్నారు. త్వరలోనే జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో రైతుబంధు సమితీల ఆధ్యర్యంలో రైతులకు అవగాహన కల్పిస్తామన్నారు. ఇక ప్రజా ప్రతినిధులు తప్పని సరిగా భౌతిక దూరం పాటిస్తూ తమ కార్యకలాపాలు నిర్వహించుకోవాలని కోరారు.

ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా..

కరోనా మహమ్మారి పోలేదని, మీటరు దూరంలో కరోనా ఉందన్న ప్రమాదాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించి జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. లాక్​డౌన్ సడలించామంటే కరోనా పోయినట్లు కాదన్నారు. నిర్లక్ష్యంగా ఉంటే కరోనా కబలించే ప్రమాదం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, జడ్పీఛైర్ పర్సన్ గుజ్జ దీపికా, యుగేంధర్​ రావులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి : 'ఆ పోస్టుల భర్తీలో ఎలాంటి అక్రమాలకు తావులేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.