సూర్యాపేట జిల్లా నాగారం మండలం వర్ధమానుకోట గ్రామంలో మంత్రి జగదీశ్వర్‌రెడ్డి పర్యటించారు. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురికి కరోనా సోకిన నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే గాదరి కిశోర్, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, ఎస్పీ భాస్కరన్‌తో కలిసి మంత్రి హుటాహుటిన ఆ గ్రామాన్ని సందర్శించారు.
వర్ధమానుకోట గ్రామంలో ప్రజలెవరూ ఇంటి నుంచి బయటికి రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రతి ఇంటికి బియ్యం, నిత్యవసర వస్తువులు, మందులు పంపిణీ చేయాలన్నారు. గ్రామస్థులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న మంత్రి.. పాజిటివ్ లక్షణాలు వచ్చిన అందిరినీ గుర్తించి చికిత్స అందిస్తామన్నారు.
భయాందోళనలు రేకెత్తించేలా అనవసర ప్రచారం చేయొద్దని మంత్రి కోరారు. వైద్య సిబ్బంది, అధికారులు గ్రామంలోనే ఉండి పరిస్థితిని చక్కదిద్దుతారని హామీ ఇచ్చారు. అనంతరం గ్రామంలో రసాయనాలను స్ఫ్రే చేయించారు.
ఇవీచూడండి: డ్రోన్ వీడియో: హైదరాబాద్‌ను ఇలా ఎప్పుడైనా చూశారా?