సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం చందుపట్లలో ప్రతిమ స్వచ్ఛంద సంస్థ ఉపాధి హామీ కూలీలకు మాస్కులు పంపిణీ చేసింది. కూలీలకు 1000 మాస్కులను అందించిన ప్రతిమ స్వచ్ఛంద సంస్థను గ్రామ సర్పంచ్ కస్తూరి రాణి అభినందించారు.
ప్రజలు భౌతిక దూరం పాటించి... కరోనా మహమ్మరి నుంచి రక్షణ పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ శ్రీరాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.