సూర్యాపేట జిల్లా నూతన్‌కల్ మండల కేంద్రంలో పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. అడ్డగోలుగా అరుస్తూ.. ఎదురుపడిన వారందరి మీద దాడి చేసింది. పిచ్చికుక్క దాడిలో ఎనిమిది మంది గాయపడ్డారు. బాధితులను స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గ్రామస్థులను కరిచిన పిచ్చికుక్కను గ్రామంలోని యువకులు వెంటాడి హతమార్చారు. అధికారులు స్పందించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.
ఇదీ చూడండి: గణేషుడికీ ఓ పార్కు, మ్యూజియం ఉన్నాయి.. అవి ఎక్కడో తెలుసా!