ETV Bharat / state

లాక్​డౌన్​ వేళ.. వైద్యం అందక చిన్నారి మృతి

లాక్​డౌన్​ ఓ చిన్నారి పాలిట శాపమైంది. ప్రైవేటు, ప్రభుత్వ వైద్యులు అందుబాటులో లేక 18 నెలల బాలుడు ప్రాణాలు కోల్పోవడం విషాదం నింపింది. కన్నవారికి కడుపుకోత మిగిల్చింది. ఈ హృదయ విదారకమైన ఘటన సూర్యాపేట జిల్లా కోదాడలో గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.

Lockdown healing of a child dead in suryapet district
లాక్​డౌన్​ వేళ.. వైద్యం అందక చిన్నారి మృతి
author img

By

Published : Apr 10, 2020, 7:28 AM IST

సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం బీమ్లతండాకు చెందిన అతడి కుమారుడు మల్లేశ్‌ కోదాడలోని మట్టపల్లి ఎన్‌సీఎల్‌ కర్మాగారంలో పనిచేస్తున్నారు. బుధవారం రాత్రి 9.30 గంటల సమయంలో మల్లేశ్‌ 18 నెలల కుమారునికి కడుపునొప్పి రావడం వల్ల ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యుడు అందుబాటులో లేకపోవడం వల్ల మరో ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడా అదే పరిస్థితి ఎదురైంది. ఇలా పలు ఆసుపత్రులు తిరుగుతూ.. రాత్రి ఒంటి గంటకు ప్రభుత్వ కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రంకి వెళ్లారు. 24 గంటలూ పనిచేయాల్సిన ఆసుపత్రి తలుపులు వేసి ఉన్నాయి. ఎంతసేపు నిరీక్షించినా వైద్యులు, సిబ్బంది రాలేదు.

ఏ ఆసుపత్రికి వెళ్లినా కరోనా కారణంగా వైద్యులు రాలేదని సిబ్బంది చెప్పారని చిన్నారి తాత భూక్యా పాండూనాయక్‌ తెలిపారు. సకాలంలో చికిత్స అందకపోవడం వల్లనే తన మనవడు ప్రాణాలు కోల్పోయాడని విలపించాడు. బీమ్లతండాలో చిన్నారి అంత్యక్రియలు గురువారం నిర్వహించారు. ఈ విషయమై డీసీహెచ్‌ఎస్‌ వెంకటేశ్వర్‌ను సంప్రదించారు. సీహెచ్‌సీలో రాత్రిపూట వైద్యులు తప్పనిసరిగా అందుబాటులో ఉంటారని, చిన్నారి కుటుంబ సభ్యులు సరిగ్గా గమనించకపోయి ఉండవచ్చని పేర్కొన్నారు.

ఇదీ చూడండి : కరోనా అవగాహన కోసం... సీఆర్​పీఎఫ్ పోలీసుల పాట

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.