ETV Bharat / state

మూసీ మురికి జలాల నుంచి సూర్యాపేటకు విముక్తి - MOOSI RIVER

గత నలభై సంవత్సరాలుగా మూసీ నీళ్లు తాగలేకపోతున్నామని వీళ్లంతా అనేక ఆందోళనలు చేశారు. మురుగు నీరు నోట్లో పోసుకోలేని పరిస్థితి ఉందని ఆవేదన చెందారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్​ భగీరథతో కలుషిత మూసి జలాలు తాగే ఇబ్బందులు తప్పాయని సూర్యాపేట పట్టణ వాసుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.

MOOSI RIVER
author img

By

Published : Jul 21, 2019, 2:47 PM IST

దేశంలోనే నీటి వ్యాపారం ప్రారంభమైన పట్టణంగా సూర్యాపేటకు గుర్తింపు ఉంది. అత్యంత కలుషితమైన నదిగా పేరున్న మూసీ నీటిని సేవిస్తున్న వాళ్ళు ఈ సూర్యాపేట వాసులే. హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారి మధ్యలో ఉన్న సూర్యాపేటకు వాణిజ్య కేంద్రంగా గుర్తింపు ఉంది. పట్టణ జనాభా లక్షా ఇరవై వేలు కాగా రోజుకు 50 వేల మంది ప్రయాణికులు ఈ పట్టణం నుంచి ప్రయాణం చేస్తారు. ఇంత ప్రాముఖ్యత ఉన్నా... ఇన్నాళ్లుగా కలుషితమైన మూసీ నీటిని తాగలేక తల్లడిల్లిపోయారు. ఒకవైపు ఫ్లోరైడ్ , మరోవైపు మూసి విషతుల్యమైన నీటిని సేవిస్తున్న సూర్యాపేట ప్రజలు అనేక రోగాలకు బారిన పడ్డారు. వివిధ రకాల రుగ్మతలతో ఆస్పత్రుల పాలయ్యారు. చర్మ, మూత్రపిండ సంబంధిత వ్యాధులతో అవస్థలు పడ్డారు.

మూసీ నీటి నుంచి సూర్యాపేటకు విముక్తి

నెలకు రూ.3 కోట్ల మేర తాగునీటి వ్యాపారం

రాష్ట్రంలో ఎక్కడా లేని నీటి శుద్ధి యంత్రాలు ఈ పట్టణంలో నెలకొన్నాయి. చాలిచాలని జీతాలతో కుటుంబం సాకటమే కష్టమైనప్పటికీ... తాగునీటి కొనుగోలుకే తమ సంపాదనలో అధికభాగం ఖర్చు చేసేవారు. పట్టణంలో నెలకు 3 కోట్ల రూపాయల మేర నీటి వ్యాపారం జరుగుతున్నట్లు అంచనా. వేసవి కాలం వచ్చిందంటే పట్టణంలో ఈ కొరత తీవ్రంగా ఉండేది. స్వచ్ఛమైన నీటికోసం సూర్యాపేట ప్రజలు ఆందోళన బాట పట్టిన సందర్భాలు అనేకం ఉన్నాయి.

మిషన్​ భగీరథతో విముక్తి

మిషన్​ భగీరథ సూర్యాపేట ప్రజలకు వరంగా మారింది. ప్రధానంగా కలుషితమైన మూసి జలాల నుంచి విముక్తి లభించింది. అనాజిపురం సమీపంలో నిర్మించిన మిషన్ భగీరథ ట్యాంకు ద్వారా రోజుకు 13 ఎమ్.ఎల్.డీ ల నీరు సూర్యాపేటకు సరఫరా అవుతోంది. భగీరథ జలాలను సేవిస్తున్న పట్టణ వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రోజు విడిచి రోజు భగీరథ నీటిని వదులుతున్నారు. శాంతి నగర్ సమీపంలో నిర్మిస్తున్న 15 కె.ఎల్.సామర్థ్యం ఉన్న పెద్ద ట్యాంకు పూర్తైతే ప్రతిరోజు నీరిచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

రూ.17కోట్ల పురపాలక సంఘం ఆదాయంలో ఎక్కువ ఖర్చు మూసీనీటి సరఫరాకే అయ్యేదని మున్సిపల్​ కమిషనర్​ రామనుజుల రెడ్డి తెలిపారు. ఈ నీటిని శుద్ది చేయడానికీ ఆలం, పటిక, క్లోరిన్ వాయువును అత్యంత ఎక్కువ స్థాయిలో ఉపయోగించాలిన దుస్థితి. భగీరథ నీటి కారణంగా ఈ ఇబ్బందులు తప్పాయని అధికారులు చెబుతున్నారు.

నలభై ఏళ్లుగా కలుషిత తాగునీటితో ఇబ్బంది పడిన పట్టణవాసులు.. మిషన్​ భగీరథ నీరు తమకు ఆరోగ్యంతో పాటు, నీటి ఖర్చు తగ్గిస్తోందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు ఇలాగే స్వచ్ఛమైన తాగు నీటిని సరఫరా చేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

ఇవీ చూడండి:దేశానికే ఆదర్శం... ఈ రెండు గ్రామాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.