కేసీఆర్ మంచి విజన్ ఉన్న ముఖ్యమంత్రి అని శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. అభివృద్ధి కోసం అన్నివిధాలా ఆలోచించే సీఎంకు ప్రతి ఒక్కరూ మద్దతు తెలపాలని ఆయన వెల్లడించారు. రైతుబంధు చాలా అద్భుతమైన పథకమని గుత్తా చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 24 గంటల విద్యుత్ తెలంగాణలోనే ఇస్తున్నారని పేర్కొన్నారు. కరోనా సంక్షోభ సమయంలో ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైనా అభివృద్ధి కార్యక్రమాల్లో వెనుకడుగు వేయలేదని ఆయన స్పష్టం చేశారు.
వరదలు రావడం సహజమని... అమెరికా లాంటి దేశాల్లోనే వరదలు వస్తున్న సమయంలో కొంత ఇబ్బందులు ఏర్పడుతాయన్నారు. దేశంలో గతంలో కూడా వరదల వల్ల ప్రజలు అనేక సార్లు ఇబ్బందులు పడ్డారని తెలిపారు. 110 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్లో వరదలు వచ్చాయని.. ప్రభుత్వం స్పందించి కుటుంబానికి 10వేల రూపాయల చొప్పున ఇవ్వడం మంచి నిర్ణయమన్నారు. ఐటీ రంగంలో తెలంగాణ దూసుకుపోతోందని గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. యువ నాయకుడు కేటీఆర్ చొరవ చాలా హర్షణీయమన్నారు.
ఇవీ చూడండి: 'ప్రభుత్వానికి చెందవు.. ఎవరైనా ప్రకటనలు పెట్టుకోవచ్చు'