ETV Bharat / state

సాగు భూముల్లో ప్రకృతివనం.. లబోదిబోమంటున్న రైతాంగం! - తెలంగాణ వార్తలు

అది... చెరువుకు అత్యంత సమీపంలో... ఎఫ్​టీఎల్​ పరిధికి దూరంగా ఉన్న భూమి. ఏడెనిమిది దశాబ్దాలుగా... నిరుపేదల సాగులో ఉంది. కొన్నేళ్ల క్రితం వరకు సదరు స్థలానికి... క్రమం తప్పకుండా శిస్తు చెల్లించారు. కానీ పల్లె ప్రకృతి వనం పేరిట రెవెన్యూ అధికారులు... ఆ భూమిని స్వాధీనం చేసుకోవడంతో సూర్యాపేట జిల్లాలో సాగుదారులు లబోదిబోమంటున్నారు.

land-occupied-for-palle-vanam-in-suryapet-district
పల్లె వనం కోసం భూమి... లబోదిబోమంటున్న సాగుదారులు
author img

By

Published : Dec 27, 2020, 9:57 AM IST

పల్లె వనం కోసం భూమి... లబోదిబోమంటున్న సాగుదారులు

రాష్ట్రవ్యాప్తంగా పల్లెల్లో ప్రభుత్వం ప్రకృతివనాలను ఏర్పాటుచేస్తోంది. నిబంధనల ప్రకారం ప్రకృతి వనానికి కావాల్సింది... అయిదు గుంటల స్థలం. కానీ సూర్యాపేట జిల్లా చివ్వెంల అధికారులకు మాత్రం... ప్రకృతి వనానికి మూడెకరాల వరకు భూమి సేకరించారు. మూడు పంచాయతీలు, మరో మూడు అనుబంధ పల్లెలకు సంబంధించి వీకేపహాడ్‌లోని భూమి తీసుకున్నారు. ఈ భూమిని... వీకే పహాడ్‌కు చెందిన 40 కుటుంబాలు సాగు చేసుకుంటున్నాయి. ఆ స్థలాన్ని అధికారులు స్వాధీనం చేసుకోవడంతో... సాగుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆనవాయితీగా వస్తోంది..

దూదేకుల వంశానికి చెందిన కుటుంబాల వారే... అనాదిగా శిఖం భూమిని సాగు చేస్తున్నారు. సదరు భూముల్లోకి వెళ్లేందుకు బాట లేకున్నా... ఇంటికి 15 వేలు వేసుకుని 6 లక్షల రూపాయలతో మట్టి కట్ట నిర్మించుకున్నారు. వీకే పహాడ్‌లో సదరు వంశానికి సంబంధించి 40 కుటుంబాలున్నా... వారి పెద్దల లెక్క ప్రకారం అయిదు కుటుంబాలుగానే పరిగణిస్తున్నారు. ప్రస్తుతం అధికారులు స్వాధీనం చేసుకున్న భూమిని ఆ సామాజిక వర్గీయులు... అంతర్గతంగా దేవుడి మాన్యం పేరిటే భావిస్తూ... ఏడాదికొకరు సాగు చేసుకుంటున్నారు. అందులో పంట వేసినవారే... ఆ సంవత్సరం పీర్ల పండుగ చేయడం ఆనవాయితీగా వస్తోంది.

స్పందించడం లేదు..

246 సర్వే నంబరులో ఉన్న 77.09 ఎకరాల భూమిలో 15 నుంచి 20 ఎకరాల్లో చెరువు ఉంటుంది. మిగిలిన భూమిలో మూడెకరాలు... దశాబ్దాల కాలం నుంచి పేదల సాగులో ఉంది. ఈ సాగులో ఉన్న భూమిని పల్లె ప్రకృతివనం కోసం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మానవతా దృక్పథంతో భూమిని వదిలేయాలంటూ చివ్వెంల తహసీల్దార్‌ కార్యాలయంతోపాటు సూర్యాపేట కలెక్టరేట్‌కు తిరిగినా... అధికారులు స్పందించడంలేదని అంటున్నారు.

రెండు నెలల క్రితం భూమిని స్వాధీనం చేసుకున్న తహసీల్దార్... కొద్ది రోజుల క్రితం కలెక్టరేట్‌కు బదిలీ అయ్యారు. ప్రస్తుత తహసీల్దార్ మాత్రం ఈ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తూనే... వివాదంపై దృష్టిసారిస్తామని అంటున్నారు.

ఇదీ చూడండి: భూమి కోసం.. పెదనాన్నను పొట్టన పెట్టుకున్నాడు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.