ETV Bharat / state

ఉపాధి హామీ కూలీలకు తప్పని ఇబ్బందులు - officers negligence in upadhi haami works

లాక్​డౌన్​ సమయంలో పనులు లేక ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఉపాధి హామీ పనులు కల్పించారు. అక్కడా కూలీలకు ఇబ్బందులు తప్పటంలేదు. సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్​ మండలం శ్రీనివాసపురంలో ఉపాధిహామీ పనుల్లో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించటం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కూలీలు వాపోతున్నారు.

labour facing problems in upadhi haami works
ఉపాధి హామీ కూలీలకు తప్పని ఇబ్బందులు
author img

By

Published : May 9, 2020, 5:14 PM IST

సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్ మండలం శ్రీనివాసపురంలో అధికారులు నిర్లక్ష్యం వల్ల ఉపాధి హామీ కూలీలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కనీస సౌకర్యాలు కూడా అధికారులు ఏర్పాటు చేయలేదని కూలీలు వాపోతున్నారు. టెక్నికల్​ సిబ్బంది సైతం అందుబాటులో లేరని చెబుతున్నారు. కార్యదర్శి కూడా రోజూ రావడం లేదని కూలీలు ఆరోపిస్తున్నారు.

కొలతలు, లెక్కలు సైతం కూలీలే చూసుకోవాల్సి వస్తోందని కూలీలు తెలిపారు. తమ సంతకాలు పడుతున్నాయో లేదో కూడా తెలియట్లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఇబ్బందులన్ని ఎంపీడీవోకు విన్నవించి... కలెక్టర్​ దృష్టి తీసుకెళ్లాలని కోరతామని కూలీలు తెలిపారు.

ఇవీచూడండి: ధాన్యం సేకరణలో అగ్రస్థానంలో తెలంగాణ: కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.