కార్తిక పౌర్ణమి సందర్భంగా సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా శివాలయాలన్ని భక్తులతో కిటకిటలాడుతున్నాయి. సూర్యాపేట పురపాలిక పరిధిలోని పిల్లలమర్రి నామేశ్వర, ఎరకేశ్వర శివాలయాల్లో కార్తిక పూజలు అట్టహాసంగా నిర్వహించారు. తెల్లవారుజామునే భక్తులు వెలిగించిన కార్తిక దీపాల కాంతుల్లో ఆలయం వెలుగులీనుతోంది.
హుజూర్నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా జంగమయ్య కోవెలలన్ని భక్తులతో సందడిగా మారాయి. తెల్లవారుజామునే పుణ్యస్నానాలు ఆచరించి భక్తులు కార్తిక దీపాలు వెలిగించారు. శివయ్యకు రుద్రాభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు.
ఓం నమఃశివాయ నామస్మరణలతో సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఆలయ ప్రాంగణాలన్ని భక్తిపారవశ్యంతో సందడిగా మారాయి.
- ఇదీ చూడండి : కార్తికమాస పూజలతో ఆలయాల్లో ఆధ్యాత్మిక శోభ