ETV Bharat / state

మద్దిరాల మండలంలో కల్లాల ఏర్పాటుకు భూమిపూజ

రైతులంతా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కల్లాలను సద్వినియోగం చేసుకోవాలని రైతుబంధు సమితి సూర్యాపేట జిల్లా సమన్వయకర్త రజాక్ పిలుపునిచ్చారు. సూర్యాపేట జిల్లా మద్దిరాల మండల కేంద్రంలో ఆయన రైతు కల్లాలకు భూమి పూజ చేశారు.

kallam inaugurated in suryapet district maddirala
మద్దిరాల మండలంలో కల్లాల ఏర్పాటుకు భూమిపూజ
author img

By

Published : Jul 7, 2020, 1:59 PM IST

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా ప్రభుత్వం రైతులకు సబ్సిడీ కింద ఏర్పాటు చేస్తున్న రైతు కల్లాలను సద్వినియోగం చేసుకోవాలని రైతుబంధు సమితి సూర్యాపేట జిల్లా సమన్వయకర్త రజాక్​ అన్నారు. సోమవారం ఆయన సూర్యాపేట జిల్లాలోని మద్దిరాల మండల కేంద్రంలో రైతు కల్లాలకు భూమి పూజ చేసి ప్రారంభించారు.

ఒక్కో మండలంలో 168 కల్లాల ఏర్పాటుకు అనుమతి ఉందని, ఎస్సీ, ఎస్టీలకు వందశాతం, బీసీలకు పది శాతం సబ్సిడీతో కల్లాలు ఏర్పాటు చేస్తమని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ కన్నా సురాంబ, వైస్​ ఎంపీపీ బెజ్జంకి శ్రీరామ్​ రెడ్డి, ఏడీఏ జగ్గు నాయక్​, ఎంపీడీవో సరోజ, ఏపీవో లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: చేనేత రంగంలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు: కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.