బ్రహ్మకుమారిస్ ఈశ్వరయ్య విశ్వవిద్యాలయ ఆధ్వర్యంలో మహాశివరాత్రి నేపథ్యంలో సూర్యాపేట జిల్లా కోదాడలో జ్యోతిర్లింగాల ప్రదర్శనను ఏర్పాటు చేశారు. మొట్టమొదటిసారిగా పట్టణంలోని కాశీనాథ్ ఫంక్షన్ హాల్లో కైలాసగిరి అమరనాథ్ జ్యోతిర్లింగ క్షీరాభిషేక శివలింగ దర్శనాన్ని ఏర్పాటు చేశారు.
దీనిని కోదాడ ఎంపీపీ చింతా కవిత రెడ్డి ప్రారంభించారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని శుక్రవారం వరకు ఈ ప్రదర్శన ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ప్రదర్శనలో భాగంగా కైలాసగిరి సెట్టింగ్ భక్తులను ఆకట్టుకుంటుంది. భారతదేశంలో ఉన్న అన్ని జ్యోతిర్లింగాలను ఈ ప్రదర్శన ద్వారా అందుబాటులోకి తీసుకువచ్చారు. ఆధ్యాత్మికతను పెంపొందించేందుకు ప్రొజెక్టర్ ద్వారా భక్తులకు వివరించనున్నట్టు నిర్వాహకులు చెప్పారు.
ఇవీ చూడండి: 'వారి గాథలు వినడం కాదు... మనమే చరిత్ర సృష్టించాలి