ETV Bharat / state

Jagadish Reddy Shocking Comments on Congress Guarantees : 'కాంగ్రెస్​ ఇచ్చిన హామీలు.. వారంటీలు లేని గ్యారెంటీల్లా ఉన్నాయి' - తెలంగాణలో కాంగ్రెస్​ హామీలు

Jagadish Reddy on Congress Guarantees : కాంగ్రెస్​ విజయభేరి సభలో ఇచ్చిన హామీలు అబద్ధాలేనని రాష్ట్ర విద్యుత్​ శాఖ మంత్రి జగదీశ్​ రెడ్డి ఆరోపించారు. ఆ పార్టీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనూ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని విమర్శించారు. కాంగ్రెస్​ చర్యలతో రాష్ట్రంలో రెండు తరాల భవిష్యత్తు వెనక్కి వెళ్లిందని మండిపడ్డారు.

Etv Bharat
Jagadish Reddy on Congress Party
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 18, 2023, 10:04 PM IST

Jagadish Reddy on Congress Guarantees : కాంగ్రెస్​ పార్టీ ఇచ్చిన హామీలను(Congress Guarantees) చూస్తే ఇచ్చేలా ఉన్నాయా.. అసలు వారు అధికారంలోకి వస్తారానని రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్​ రెడ్డి(Jagadish Reddy) ఎద్దేవా చేశారు. సూర్యాపేటలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలు అన్నీ బోగస్ అన్నారు. కాంగ్రెస్ చరిత్ర ఎప్పుడూ ప్రజల వైపు లేదన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చిన చరిత్ర కాంగ్రెస్​కు లేదన్నారు. అధికారం కోసం ఇక్కడి నేతల స్క్రిప్ట్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలు చదివారని అన్నారు.

Jagadish Reddy Comments on Congress : కాంగ్రెస్ ఎలాగైనా అధికారంలోకి రావాలని రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలనే కాపీ చేసి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని జగదీశ్​ రెడ్డి విమర్శించారు. అమలుకు సాధ్యం కానీ అబద్ధాల హామీలు ఇచ్చే అలవాటు కేసీఆర్​కు లేదని తెలిపారు. నూటికి నూరు శాతం చెప్పిన హామీలు అమలు చేసి.. మేనిఫెస్టోలో చెప్పనవి కూడా ప్రవేశపెట్టిన నాయకుడు కేసీఆర్​ అని కొనియాడారు. బీఆర్​ఎస్​ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామ రక్షని పేర్కొన్నారు.

Jagdish Reddy Vs Kishan Reddy : 'మీ రాష్ట్రాల్లో అభివృద్ధి.. మా తొమ్మిదేళ్ల పాలనలో అభివృద్ధిపై చర్చకు సిద్ధమా'

ఏ రాష్ట్రంలోనూ రూ.1000కి మించి ఇవ్వలేదు : కాంగ్రెస్ నాయకులు అధికారంలో ఉన్న ఒక్క రాష్ట్రంలోనూ ఆదివారం ప్రకటించిన పథకాలు లేవన్నారు. రాష్ట్రానికో మెనిఫెస్టోతో ప్రజలను మోసం చేయాలని కాంగ్రెస్ చూస్తుందన్నారు. విజయభేరి సభ(Vijaya Bheri Sabha)లో చెప్పిన హామీలు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఉన్నాయానని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో నేతలు ఇస్తున్న పింఛన్లు ఎక్కడా రూ.1000 మించి ఇవ్వలేదని ఆరోపించారు. కన్నతల్లికి అన్నం పెట్టలేని వాడు పినతల్లికి పీతాంబరం పెడతా అన్నట్లు కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోందని మంత్రి జగదీశ్​ రెడ్డి ఎద్దేవా చేశారు.

'ఓడిపోతామనే బాధతోనే భాజపా భౌతిక దాడులు.. ఎన్ని ప్రయత్నాలు చేసినా..!'

Jagadish Reddy Reaction on Congress Guarantees : చైతన్యవంతులైన తెలంగాణ ప్రజల ముందు కాంగ్రెస్ వ్యూహాలు చెల్లవని వెల్లడించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాలనతో ప్రజలు విసుగు చెందారని అన్నారు. కేసీఆర్ లాంటి నాయకుడు ప్రత్యామ్నాయం లేనందునే ప్రజలు కర్ణాటకలో కాంగ్రెస్​కు ఓటు వేశారని అన్నారు. వారంటీలు లేని గ్యారెంటీలు ఇచ్చి కర్ణాటకను కాంగ్రెస్ పార్టీ ఆగం చేసిందన్నారు. తెలంగాణ పోరాటాలను హస్తం పార్టీ(Congress Party) పదేపదే అవమానిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఏర్పాటులో కాంగ్రెస్‌ పార్టీ చేసిన కాలయాపన ఫలితంగానే రాష్ట్రంలో ఆత్మబలిదానాలు జరిగాయని విమర్శించారు. కాంగ్రెస్‌ చర్యలతో తెలంగాణ రెండు తరాల భవిష్యత్‌ను కోల్పోయిందని మంత్రి ఆగ్రహించారు. ఈ సమావేశంలో నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్థి లింగయ్య పాల్గొన్నారు.

"కాంగ్రెస్​ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోను ఆదివారం హామీలు ఇచ్చిన పథకాలు ఇవ్వలేదు. కాంగ్రెస్​ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో రూ.1000 మించి పింఛన్​ ఇవ్వలేదు." - గుంటకండ్ల జగదీశ్​ రెడ్డి, మంత్రి

Jagadish Reddy Reaction కాంగ్రెస్​ పార్టీపై విమర్శలు చేసిన జగదీశ్ రెడ్డి

'మునుగోడులో ఓటమి అక్కసుతోనే సీఎం కేసీఆర్​పై మోదీ విషం చిమ్మారు'

రాబోయే రోజుల్లో కృత్రిమ విద్యుత్ సంక్షోభం ఖాయం: జగదీశ్వర్ రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.