ETV Bharat / state

అటవీశాఖ సిబ్బందిపై ఆక్రమణదారుల దాడి - సూర్యాపేట జిల్లాలో అటవీశాఖ సిబ్బందిపై ఆక్రమణదారుల దాడి

అర్ధరాత్రి వేళ అటవీ భూములను చదును చేస్తున్న వారిని అడ్డుకున్న అటవీశాఖ సిబ్బందిపై ఆక్రమణదారులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది.

Invaders attack on forest staff
అటవీశాఖ సిబ్బందిపై ఆక్రమణదారుల దాడి
author img

By

Published : Jan 21, 2020, 10:27 AM IST

అర్ధరాత్రి వేళ అటవీ భూములను చదును చేస్తున్నారన్న సమాచారంతో అడ్డుకునేందుకు వెళ్లిన అటవీశాఖ సిబ్బందిపై ఆక్రమణదారులు దాడిచేసి గాయపరిచారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండల పరిధిలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది.

మఠంపల్లి మండలం సుల్తాన్‌పూర్‌ బ్లాక్‌ రిజర్వ్‌ అటవీ భూములను రామచంద్రాపురం తండాకు చెందిన కొందరు యంత్రాలతో చదును చేస్తున్నారని స్థానికులు చింతలమ్మగూడెం బీట్‌ అధికారి మురళికి అర్ధరాత్రి సమాచారం అందించారు. ఆయన బేస్‌ క్యాంపు సిబ్బంది సైదులు, విజయ్‌ను వెంట తీసుకుని అక్కడికి వెళ్లారు.

అప్పటికే అక్కడ సుమారు 20 మంది జేసీబీ సాయంతో భూమిని చదును చేస్తూ కనిపించారు. వారిని అడ్డుకునేందుకు అటవీశాఖ సిబ్బంది ప్రయత్నించడం వల్ల ఆక్రమణదారులు దాడికి పాల్పడ్డారు.

బీట్‌ అధికారి మురళి, విజయ్‌, సైదులుకు గాయాలయ్యాయి. పరిస్థితి అదుపు తప్పడం వల్ల వారు సమీప గ్రామంలోకి వెళ్లి, స్థానికుల సాయంతో ఇళ్లకు చేరుకున్నారు. సోమవారం డీఎఫ్‌వో ముకుంద్‌రెడ్డికి విషయాన్ని తెలియజేయగా ఆయన ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలన జరిపారు. అనంతరం ఆర్వో శ్రవణ్‌కుమార్‌, డీఆర్వో కరుణాకర్‌లతో కలిసి మఠంపల్లి మండల కేంద్రంలో బాధితుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు స్థానిక పోలీస్‌స్టేషనులో ఫిర్యాదు చేశారు.

అటవీశాఖ సిబ్బందిపై ఆక్రమణదారుల దాడి

ఇదీ చదవండి: నిర్భయ దోషి పిటిషన్​పై నేడు 'సుప్రీం' విచారణ

Intro:అటవీ శాఖ అధికారులపై హత్యయత్నం
రామచంద్రాపురం తండ శివారులో అటవీశాఖ భూములను ఆక్రమించుకుంటునట్టు సమాచారం రాగ చింతలమ్మ గూడెం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ B మురళి మరియు వారి సిబ్బంది తో కలిసి తేది: 19.01.2020 నాడు అర్దరాత్రి సమయములో అట్టి స్థలం వద్దకు వెళ్లి అటవి భూమి ఆక్రమణను ఆపుటకు ప్రయత్నించగా రామచంద్రాపురం తండకు చెందిన కొంతమంది వ్యక్తులు వారిపై దాడి చేసి వారిని చంపటానికి ప్రయత్నించినారని ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ B మురళి పిర్యాదు ఇవ్వగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంబించానైనది అని వై.ప్రసాద్ సబ్. ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మట్టంపల్లి గారు తెలిపినారు. ఇట్టి సంఘటనలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ B మురళి తలకు రక్తగాయము అయినది.Body:రిపోర్టింగ్ అండ్ కెమెరా రమేష్
సెంటర్ హుజుర్ నగర్Conclusion:ఫోన్ నెంబర్ 7780212346
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.