ETV Bharat / state

ఇద్దరు సాఫ్ట్​వేర్​ మిత్రుల వినూత్న ఆలోచన.. రెస్టారెంట్​గా ముస్తాబైన లారీ.. - Innovative ideas

Lorry Food Truck: వాళ్లిద్దరు సాఫ్ట్​వేర్​ ఉద్యోగులు.. ఏళ్లుగా ఉద్యోగం చేస్తున్నా.. వాళ్ల మనసంతా వ్యాపారం పైనే.. ఏదైనా కొత్తగా వ్యాపారం చేయాలన్నది వాళ్ల చిరకాల ఆశ. అందుకోసం గతకొన్ని రోజులుగా ఆలోచిస్తున్నారు. అందులో భాగంగానే ఫుడ్​ ట్రక్​ ఐడియా వాళ్లను బాగా ఆకర్షించింది. అయితే.. ప్రస్తుతం మార్కెట్​లో చాలా ఫుడ్​ ట్రక్​లు వచ్చాయి. మరి వాటికి భిన్నంగా ఉండాలంటే ఏం చేయాలన్నదానిపై వారి సృజనాత్మకతకు పని చెప్పారు. అప్పుడు తట్టిందే.. కదిలే హోటల్​ ఐడియా..

Innovative idea of two software friends made a lorry as a restaurant

author img

By

Published : Mar 6, 2022, 2:16 PM IST

ఇద్దరు సాఫ్ట్​వేర్​ మిత్రుల వినూత్న ఆలోచన.. రెస్టారెంట్​గా ముస్తాబైన లారీ..

Lorry Food Truck: ఏపీలోని కృష్ణ జిల్లా జగ్గయ్యపేటకు చెందిన మిక్కిలినేని శివ, చిక్కేలా యశ్వంత్ 15 ఏళ్లుగా సాఫ్ట్​వేర్​ కొలువు చేస్తున్నారు. ఐదంకెల జీతం తీసుకుంటున్నారు. కొవిడ్ కారణంగా ఇంటి దగ్గరే వుంటూ ఉద్యోగం చేస్తున్నారు. ఇంకా వినూత్నంగా ఏదో చేయాలనే ఆలోచన శివ, యశ్వంత్​ను కదిలే ఆహారశాల రూపకర్తలుగా మార్చింది.

కస్టమర్లు కూర్చొని తినేలా..

వ్యాపారం చేయాలన్న వాళ్లకున్న కోరికకు ఫుడ్​ ట్రక్​ ఐడియా తోడైంది. ఇప్పటి వరకు మార్కెట్​లో ఉన్నవి కేవలం కదిలే వంటశాలలే.. అయితే ఇంకాస్త సృజనాత్మకంగా ఏదైనా చేయాలన్న తపన పడ్డారు. దాని ఫలితమే.. కదిలే ఆహారశాల ఆలోచన. ఈ ఐడియాను అమలు చేయాటానికి 10 టైర్ల పాత లారీని కొనుగోలు చేశారు. దీనికి గాను సుమారు 35 లక్షల వరకు ఖర్చు చేసి... అన్ని హంగులతో ఓ ఆధునికి మొబైల్​ హోటల్​ను ముస్తాబు చేశారు. కింది భాగంలో అన్ని సౌకర్యాలున్న వంటశాల.. పైభాగంలో 24 మంది కస్టమర్లు కూర్చొని తినేందుకు వీలుగా సీటింగ్​ ఏర్పాటు చేేశారు. కస్టమర్ల ఆర్డర్​ రెడీ కాగానే.. కిచెన్​ నుంచి నేరుగా పైకి వచ్చేలా లిఫ్ట్​ ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలతో పాటు టీవీలను కూడా అమర్చారు. ఈ ఆధునిక మొబైల్ హోటల్​ను "మాన్​స్టార్​ ఫుడ్​ ట్రక్​" పేరుతో సూర్యాపేట జిల్లా కోదాడ మండలం చిమిర్యాల క్రాస్ రోడ్డు వద్ద (65వ జాతీయ రహదారి పక్కన) రెండు రోజుల క్రితం ఏర్పాటు చేశారు.

రెస్టారెంట్స్​కి ఏ మాత్రం తగ్గకుండా..

నగరాల్లో ఉన్న ఆధునిక హోటల్స్​కి ఏమాత్రం తగ్గకుండా అన్నిరకాల సౌకర్యాలు ఏర్పాటు చేసినట్టు ఈ ఫుడ్​ట్రక్​ రూపకర్తలు శివ, యశ్వంత్​ చెబుతున్నారు. ఇందులో టీ, టిఫిన్స్​ దగ్గర్నుంచి ఇండియన్​, చైనీస్​ లాంటి పలు రకాల వంటకాలు అందుబాటులో ఉంచుతున్నట్టు తెలిపారు. శుచి విషయంలో జాగ్రత్తగా ఉంటూనే.. రుచిలో ఏమాత్రం తగ్గకుండా వినియోగదారులకు.. సరికొత్త అనుభూతినిచ్చేందుకు తమవంతు ప్రయత్నం చేశామంటున్నారు. భవిష్యత్తులో వ్యవసాయ క్షేత్రం ఏర్పాటు చేసి.. అందులో పండించిన తాజా కూరగాయలతో వంటకాలు చేసేందుకు ప్లాన్​ చేస్తున్నట్టు చెబుతున్నారు.

"దాదాపు 15 ఏళ్లుగా సాఫ్ట్​వేర్​గా చేస్తున్నా. ఎప్పటి నుంచో బిజినెస్​ చేయాలని ఆశ. అందుకోసం ఫుడ్​ట్రక్​ ఆలోచన బాగా నచ్చింది. కానీ.. ఇప్పుడున్న ఫుడ్​ ట్రక్స్​ కంటే మంచి అనుభూతిని వినియోగదారులకు ఇవ్వాలనుకున్నాం. దాని కోసం ఓ పాత లారీని తీసుకుని.. మొత్తం ఆధునిక హంగులతో ముస్తాబు చేశాం. ఇందులోనే కస్టమర్స్​ కూర్చొని తినేలా.. ఏర్పాటు చేశాం. కిచెన్​ నుంచి ఫుడ్​ పైకి వచ్చేలా లిఫ్ట్​ను పెట్టాం. ల్యాండ్​పై ఓ రెస్టారెంట్​ పెడితే ఎలా అయితే ఉంటుందో.. అలాంటి సౌకర్యాలన్నీ ఇందులో ఏర్పాటు చేశాం." - శివ, నిర్వాహకుడు

"శివతో పాటు ఐదారేళ్లుగా కలిసి పనిచేస్తున్నా. నాక్కూడా బిజినెస్​ చేయాలని ఉండటం.. తన ఫుడ్​ ట్రక్​ ఐడియా నాకు చెప్పటంతో నేనూ ఇందులో భాగమయ్యాను. సుమారు 35 లక్షలు ఖర్చు చేసి ఈ ట్రక్​ను తయారు చేశాం. మేము వంటల్లో వాడే ఆర్గానిక్ వెజిటెబుల్స్​, ఆర్గానిక్​ వ్యవసాయం గురించి వినియోగదారులకు తెలిసేలా టీవీలు కూడా పెట్టాం." -యశ్వంత్​, నిర్వాహకుడు

ట్రక్​తో పాటు ఫుడ్​ కూడా బాగుంది..

"రోడ్డుపై వెళ్తుంటే ఈ ట్రక్​ వినూత్నంగా కనిపించింది. ఎంటో చూద్దామని ముందుకు వెళ్లినవాన్ని తిరిగి వెనక్కివచ్చా. శివ, యశ్వంత్​కు వచ్చిన ఆలోచన చాలా బాగుంది. ఫుడ్​ కూడా చాలా రుచికరంగా ఉంది. కిచెన్​ చాలా విశాలంగా.. టిఫిన్​ దగర్నుంచి బిర్యానీ, తందురీ కూడా దొరుకుతుంది. కిచెన్​లో చేసే పనులు వినియోగదారులకు కనిపించేలా టీవీలు కూడా పెట్టారు." - చక్రధర్​, వినియోగదారుడు

రోడ్డు పక్కన ఇంతకుముందెన్నడూ చూడని విధంగా ఉన్న ఈ వినూత్న హోటల్​ను వాహనదారులు సందర్శిస్తున్నారు. ఆ వినూత్న అనుభవాన్ని రుచి చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. వచ్చిన వినియోగదారుల నుంచి నిర్వాహకులు ఎప్పటికప్పుడు ఫీడ్​బ్యాక్​ తీసుకుంటున్నారు. మీరూ.. అటు వైపు వెళ్లినప్పుడు కదిలే ఆహారశాలలో భోజనాన్ని ఆస్వాదించండి..

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.