ETV Bharat / state

త్రివేణి జల సవ్వడులతో... జిల్లాలో పచ్చని పంటలు - Suryapeta District

ఏడాది క్రితం వరకు అదో ఎడారి ప్రాంతం... గుక్కెడు నీళ్ల కోసం గొంతు చించుకుని అరిచిన... గోస. అలాంటి దుర్భిక్ష పరిస్థితులతో దశాబ్దాల పాటు కొట్టుమిట్టాడిన ప్రాంతం... ఇప్పుడు పచ్చని పైర్లతో కళకళలాడుతోంది. గతేడాది వరకు అక్కడక్కడ మాత్రమే పచ్చని భూమి కనిపిస్తే... ఇపుడు ఖాళీ జాగా అన్నదే లేకుండా పోయింది. మూడు నదుల నీటితో సూర్యాపేట జిల్లా... ఎస్సారెస్పీ జలాలతో సస్యశ్యామలంగా మారిన తుంగతుర్తి నియోజకవర్గంపై ప్రత్యేక కథనం.

In Suryapeta district with water of three rivers Green crops
త్రివేణి జల సవ్వడులతో... జిల్లాలో పచ్చని పంటలు
author img

By

Published : Oct 9, 2020, 3:24 PM IST

నోళ్లు తెరిచిన బీళ్ల స్థానంలో... పచ్చని కోక కప్పుకున్న చందం. వానలు లేక వలస బాట పట్టిన ప్రాంతంలో... చుట్టూ ఎటు చూసినా చల్లని పైర గాలులు. ఎడారి ప్రాంతంలో... ఏడాది కాలంలోనే సస్యశ్యామల వాతావరణం. అత్యల్ప అడవులున్న జిల్లాగా పేరున్న అపప్రథ నుంచి... అత్యధిక పంటల సాగు దిశగా పయనం. ఇదీ సూర్యాపేట జిల్లా కథాకమామీషు.

ఉద్యమాల పురిటిగడ్డగా భావించే సూర్యాపేటలో... కొంతకాలం క్రితం వరకు నీటి కోసమూ ఉద్యమం చేయాల్సి వచ్చింది. ఎంతలా అంటే... ఖాళీ బిందెలతో రోడ్డెక్కేదాకా.. రెండు తెలుగు రాష్ట్రాలకు కూడలిగా ఉన్నా... నీరు లేని కన్నీటి కథలే అంతటా కనిపించేవి. కానీ ఇప్పుడదే జిల్లా... పచ్చని పొలాలతో సుందరంగా కనిపిస్తోంది. మూడు నదుల నీటితో... త్రివేణి జల సవ్వడులను ఒడిసిపట్టుకుంటూ అత్యధిక స్థాయిలో పంటలు పండిస్తోంది.

అప్పుడలా.. ఇప్పుడిలా...

సూర్యాపేట జిల్లాలో... కృష్ణా, మూసీ నదుల నీటితో పంటలు సాగవుతుండేవి. నాగార్జునసాగర్ ఎడమ కాల్వ ద్వారా గరిడేపల్లి నుంచి కోదాడ వరకు గల జిల్లా భూముల్లో... రెండు పంటలు సాగవుతుంటాయి. ఇటు మూసీ పరివాహక ప్రాంతాల్లోనూ వరి వేస్తుంటారు. కానీ తుంగతుర్తి నియోజకవర్గం మాత్రం... ఎప్పుడూ దుర్భిక్ష పరిస్థితుల్లోనే కొట్టుమిట్టాడేది. గోదావరి జలాలు రప్పిస్తారన్న ఆశతో నాయకుల మాటలకు సంబరపడటం... కళ్లు కాయలు కాసేలా ఎదురుచూడటం తప్ప ఒరిగేదేమీ ఉండేది కాదు. దశాబ్దాల కాలం నుంచి అరిగోస పడుతున్న అలాంటి తుంగతుర్తి నియోజకవర్గం... నిజంగానే ఇప్పుడు గోదావరి జలాలతో పచ్చగా అలరారుతోంది. కనుచూపు మేర ఎటుచూసినా... ఆహ్లాదకర వాతావరణం సాక్షాత్కరిస్తోంది. ఇంతకాలం వలస బాట పట్టిన ప్రజలంతా... ఇప్పుడు ఉన్న భూమినే సాగు చేసుకుంటే చాలన్న దీమాతో సొంతూళ్లకు చేరిపోయారు. నియోజకవర్గంలో సగం వలస బాట పట్టే జనాలంతా... ప్రస్తుతం సొంతూళ్లలో హాయిగా పంటలు పండించుకుంటున్నారు.

జిల్లాలో జలకళ

శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీటిని కరవు ప్రాంతాలకు తరలించి, బీడు భూముల్ని సస్యశ్యామలం చేయాలన్న లక్ష్యంలో భాగంగా మొదలుపెట్టిన వరద కాలువ... నిజంగానే తుంగతుర్తి నియోజకవర్గం రూపురేఖలు మార్చింది. 2 లక్షల 52 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు... ఎస్సారెస్పీ రెండోదశను ఉమ్మడి జిల్లాలో ప్రారంభించారు. ఎస్సారెస్సీ నుంచి నీటిని మైలారం జలాశయానికి... అక్కణ్నుంచి జనగామ జిల్లాలోని పాలకుర్తి-కొడగండ్ల వద్ద గల బయ్యన్న వాగుకు తరలిస్తారు. బయ్యన్న వాగు నుంచి నల్గొండ జిల్లాకు ప్రధాన కాల్వ 11 కిలోమీటర్ల మేర ఉండగా... దీనికి మూడు డిస్ట్రిబ్యూటరీలు ఉన్నాయి. 69, 70, 71కి గాను 69 కింద తుంగతుర్తి, నూతనకల్, ఆత్మకూర్(ఎస్), కోదాడతోపాటు ఆరు మండలాలు... 70వ డిస్ట్రిబ్యూటరీ కింద తుంగతుర్తి మండలంలో తొమ్మిది కిలోమీటర్ల పరిధి ఉంది. ఇక 71 డిస్ట్రిబ్యూటరీలో నాగారం, అర్వపల్లి, సూర్యాపేట(గ్రామీణం), పెన్ పహాడ్, గరిడేపల్లి మండలాలు ఉన్నాయి. ఈ కాల్వకు నీరు విడుదల చేయడంతో... చివరి ఆయకట్టు సైతం జలకళను సంతరించుకుంది

మారిన రూపురేఖలు

కృష్ణా, మూసీ, గోదావరి నదుల నీటి రాకతో... సూర్యాపేట జిల్లా రూపురేఖలే మారిపోయాయి. మూడు నదుల జలాలతో జిల్లావ్యాప్తంగా 3 లక్షల 56 వేలకు పైగా ఎకరాల్లో వరి వేయగా... అందులో గోదావరి ఆయకట్టులో 2 లక్షల 14 వేల ఎకరాల్లో వరి ఉంది. దీంతో ఉమ్మడి నల్గొండ జిల్లాలో అత్యధికంగా వరి వేస్తున్న జిల్లాగా సూర్యాపేట నిలుస్తోంది. ఈ సీజన్లో వర్షాలు బాగా ఉండటం... వరద కాల్వల ద్వారా వచ్చిన నీటితో చెరువులు నిండటం... ఎక్కడికక్కడ భూగర్భజలాలు విపరీతంగా పెరగడంతో జిల్లా అంతా పచ్చటి ముసుగేసుకుంది. ముఖ్యంగా తుంగతుర్తి నియోజకవర్గమే... ఇందులో చెప్పుకోదగ్గ అంశమనాలి. ఏడాది క్రితం వరకు నెర్రెలిచ్చిన నేలలతో కనిపించిన ప్రాంతం ఇప్పుడు... సుందర దృశ్యాలతో కనువిందు చేస్తోంది. ఎస్సారెస్పీ ద్వారా జిల్లాలో 556 చెరువులు నింపడంతో... ఈ ఖరీఫ్ లో మొత్తం ఆరున్నర టీఎంసీల వరకు నీటి వినియోగమైంది.

గతంలో ఒక్కో రైతు 20 నుంచి 30కి పైగా బోర్లు వేయగా... ఇప్పుడు ఒక్క బోరుతోనే ఐదారు ఎకరాలు పండిస్తున్నారు. మొన్నటి వరకు 2 వందల అడుగులకు పైగా వేసినా రాని నీరు... ప్రస్తుతం 60 అడుగుల్లోనే చేతికందుతోంది. ఇలా మూడు నదుల నీటితో సూర్యాపేట జిల్లా... ధాన్యాగారంగా రూపుదిద్దుకుంటోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.