సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం కొత్త గోల్తండాలో అక్రమంగా నిల్వ ఉంచిన మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం విలువ దాదాపు 55 వేల రూపాయల వరకూ ఉంటుందని తెలిపారు. ఎవరికీ తెలియకుండా ఉండేందుకు ఈ మద్యాన్ని దుకాణంలో ఉంచినట్లు పోలీసులు చెప్పారు.
విశ్వసనీయ సమాచారం మేరకే మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామని ఎస్సై రామాంజనేయులు అన్నారు. మద్యం దుకాణం యజమానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
ఇవీ చూడండి: లాక్డౌన్ వేళ 'కరోనా విందు'- ఒకరు అరెస్ట్