ఐకేపీ కేంద్రానికి తీసుకువచ్చిన ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ సూర్యాపేట జిల్లా కేంద్రంలో రైతులు విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. సూర్యాపేట సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఐకేపీ కేంద్రానికి ధాన్యం తీసుకువచ్చిన రైతులు వారం రోజులుగా విక్రయాల కోసం ఎదురుచూస్తున్నారు. సంచుల కొరత ఉందంటూ.. ఐకేపీ నిర్వాహకులు కొనుగోళ్లు జరపడం లేదని అన్నదాతలు ఆగ్రహించారు. రైతుల ఆందోళనతో రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు చేరుకుని రైతులను శాంతింపచేశారు. ఐకేపీ కేంద్రం నిర్వాహకులతో మాట్లాడి ధాన్యం తూకాలు వేసే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వటంతో రైతులు ఆందోళన విరమించారు.
ఇవీ చూడండి: 'పార్టీలో ఉండాలా, వెళ్లాలా అనేది కాలమే నిర్ణయిస్తుంది'