వాళ్లంతా పొట్టకూటి కోసం ఇతర రాష్ట్రాల నుంచి వలసొచ్చిన కార్మికులు. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా లాక్‌డౌన్ విధించడం వల్ల చేతికి పనిలేక.. చేతిలో చిల్లిగవ్వ లేక అల్లాడిపోతున్నారు. దీనివల్ల హైదరాబాద్ నుంచి ఒడిశాకు పయనమైన వలస కార్మికులు సూర్యాపేట జిల్లా నెరేడుచర్లకు చేరుకున్నారు.
రహదారి వెంట చిన్న పిల్లలతో నడిచి వెళ్లడాన్ని చూసిన హుజూర్నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి కోదాడ వరకు వాహనంలో పంపించారు. అక్కడి నుంచి వారికి పాసులు ఇప్పించి స్వస్థలాలకు పంపే ఏర్పాట్లు చేశారు. దీనివల్ల వలస కూలీలు ఆనందం వ్యక్తం చేశారు.