గిరిజన రైతు భరోసా పేరిట... పోలీసులపై అకారణంగా దాడులు చేశారని హుజూర్‌నగర్ సీఐ రాఘవరావు పేర్కొన్నారు. చిన్న సభ ఏర్పాటు చేసుకుంటామని చెప్పి...షెడ్డు కూల్చేందుకు సిద్ధమయ్యారని వివరించారు. అడ్డుకున్న తమపై అకారణంగా దాడి చేశారని... బాధ్యులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
సభ పేరుతో పోలీసులపై అత్యంత పాశవికంగా రాళ్లదాడి చేశారని సీఐ చెప్పారు. భాగ్యరెడ్డి నేతృత్వంలోనే దాడి జరిగిందని స్పష్టం చేశారు.
- ఇదీ చూడండి : 'తెరాసతో యుద్ధం మొదలైంది.. గుణపాఠం చెబుతాం'