ETV Bharat / state

హుజూర్​నగర్​ ఉప ఎన్నికల ఇం​ఛార్జీగా పల్లా రాజేశ్వర్​ రెడ్డి - huzurnagar trs incharge

హుజూర్​నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేయాలని  తెరాస వ్యూహత్మకంగా అడుగులు వేస్తోంది. ఈ ఎన్నిక బాధ్యతను ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్​ రెడ్డికి అప్పగిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్​ నిర్ణయం తీసుకున్నారు.

Incharge
author img

By

Published : Sep 24, 2019, 3:05 PM IST

Updated : Sep 24, 2019, 3:34 PM IST

హుజూర్​నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న తెరాస... పకడ్బందీ ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. ఎన్నికల ప్రకటన వెలువడగానే అభ్యర్థిని ప్రకటించిన గులాబీ దళపతి...నిన్న బి-ఫారం అందజేశారు. కోదాడ, హుజూర్​నగర్​ నియోజకవర్గాల్లో పట్టున్ననేత ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిని ఉపఎన్నికల ఇం​ఛార్జీగా నియమించారు. ప్రతిపక్షపార్టీలు అభ్యర్థుల ఎంపిక విషయంలోనే తర్జనభర్జనలు పడుతంటే... సీఎం కేసీఆర్ మాత్రం ప్రచారాన్ని పరుగులు పెట్టించే దిశగా పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు.​

సూర్యాపేట జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులను సమన్వయ పరుస్తూ, స్థానికంగానే ఉంటూ, పార్టీ ఎన్నికల వ్యూహాన్ని అమలు చేయాలని ఎమ్మెల్సీ రాజేశ్వర్ రెడ్డిని కేసీఆర్ ఆదేశించారు. కొద్ది రోజుల్లోనే మున్సిపల్ ఎన్నికలు రానుండడం వల్ల ఆయా జిల్లాలకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ప్రధాన కార్యదర్శులు, ఇతర ముఖ్య నాయకులు స్థానికంగానే ఉండి, ఎన్నికలకు సన్నద్ధం కావాలన్నారు. మున్సిపాలిటీ వారీగా బాధ్యతలు తీసుకుని, ఎక్కడికక్కడ పార్టీ యంత్రాంగాన్ని సమన్వయ పరచాలని చెప్పారు.

హుజూర్​నగర్​ ఉప ఎన్నికల ఇం​ఛార్జీగా పల్లా రాజేశ్వర్​ రెడ్డి

ఇవీ చూడండి:హుజూర్​నగర్ బరిలో భాజపా.. పోటీకి​ ముగ్గురి పేర్ల పరిశీలన..

TG_Hyd_26_24_Huzoornagar_TRS_Incharge_Dry_3064645 Reporter: Nageswara Chary Script: Razaq ( ) హుజూర్ నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల ఇంచార్జీగా పార్టీ ప్రధాన కార్యదర్శి, శాసన మండలి సభ్యుడు పల్లా రాజేశ్వర్ రెడ్డిని సీఎం, టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నియమించారు. జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపిలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులను సమన్వయ పరుస్తూ, స్థానికంగానే ఉంటూ, పార్టీ ఎన్నికల వ్యూహాన్ని అమలు చేయాలని రాజేశ్వర్ రెడ్డిని సిఎం ఆదేశించారు. కొద్ది రోజుల్లోనే మున్సిపల్ ఎన్నికలు రానుండడంతో ఆయా జిల్లాలకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ప్రధాన కార్యదర్శులు, ఇతర ముఖ్య నాయకులు స్థానికంగానే ఉండి, ఎన్నికలకు సన్నద్ధం కావాలని సిఎం కేసీఆర్ ఆదేశించారు. మున్సిపాలిటీ వారీగా బాధ్యతలు తీసుకుని, ఎక్కడికక్కడ పార్టీ యంత్రాంగాన్ని సమన్వయ పరచాలని చెప్పారు.
Last Updated : Sep 24, 2019, 3:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.