ETV Bharat / state

లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ - huzur Nagar MLA Saidireddi Distributes Kalyana Lakshmi Cheques

సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్​లో కల్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే సైదిరెడ్డి పంపిణీ చేశారు. ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యానికి పది రోజుల్లో రైతుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నట్లు ఈ సందర్భంగా వెల్లడించారు.

huzur Nagar MLA Distributes Kalyana Lakshmi Cheques to Beneficiaries
లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ
author img

By

Published : May 13, 2020, 5:08 PM IST

సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్ తహసీల్దార్ కార్యాలయంలో కల్యాణ లక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే సైదిరెడ్డి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ విడతలో 25 మందికి అందజేయడం జరిగిందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలో ఉన్నన్ని రోజులు రైతుబంధు పథకం అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యానికి పది రోజుల్లో రైతుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నట్లు వెల్లడించారు. కరోనా వైరస్ ప్రభావం ఇంకా పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలందరూ ఇప్పటిలాగే భౌతికదూరం పాటించాలని కోరారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.