సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో ప్రమాదవశాత్తు మృతిచెందిన కార్యకర్తల కుటుంబాలకు ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఆర్థిక సాయం చేశారు. హుజూర్నగర్కు చెంది కూడితెట్టి ప్రసాద్, మట్టంపల్లి మండలం యతవకీళ్ల గ్రామానికి చెందిన బైరి కనకయ్యల కుటుంబాలకు చెరో రూ.2 లక్షల రూపాయల చొప్పున ప్రమాద బీమా చెక్కులను అందజేశారు.
నియోజకవర్గంలోని 7 మండలాల్లో మొత్తం 26 మంది లబ్ధిదారులకు రూ.9,32,500 విలువ గల చెక్కులను పంపిణీ చేశారు. కార్యకర్తల సంక్షేమమే తెరాస పార్టీ ప్రధాన ధ్యేయమని ఎమ్మెల్యే సైదిరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల తెరాస అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.