సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం గాంధీ నగర్ తండా గ్రామపంచాయతీ పరిధిలో హరితహారం మొక్కలను తొలగించిన వ్యక్తికి జరిమానా విధించారు. శ్మశాన వాటిక స్థలంలో నాటిన మొక్కలను అక్రమంగా తొలగించిన అన్నపురెడ్డి వెంకట్రెడ్డి అనే రైతుకి 5,300 రూపాయల జరిమానాను పంచాయతీ కార్యదర్శి విధించారు. హరితహారం మొక్కలను ఎవరు తొలగించినా నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఇవీ చూడండి: మాతృభాషలో బోధన విద్యార్థులకు ఉపయోగకరం: గవర్నర్