ప్రతిష్ఠాత్మక పెద్దగట్టు లింగమంతుల జాతరకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. మూడో రోజు స్వామివారికి మొక్కులు తీర్చుకునేందుకు క్యూ కట్టారు. సూర్యాపేట జిల్లా దురాజ్‌పల్లి పెద్దగట్టు పరిసరాలు కోలాహలంగా మారాయి. జాతరలో చేసిన ఏర్పాట్లపై భక్తులు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. అన్ని సౌకర్యాలు బాగున్నాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
పెద్దగట్టుకు వచ్చేవారి సంఖ్య మధ్యాహ్నం నుంచి పెరిగింది. ఈనెల 28న ప్రారంభమైన జాతర మార్చి 4వ తేదీ వరకు కొనసాగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. స్వామి, అమ్మవార్లను దర్శించుకోవడం పట్ల భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.