సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురం చెక్ పోస్ట్ వద్ద విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్‌కు రాష్ట్ర వైద్యారోగ్య సిబ్బంది ఆరోగ్య పరీక్షలు నిర్వహించింది. గోపిచంద్‌కు హోం క్వారంటైన్ ముద్ర వేశారు.
అత్యవసరంగా హైదరాబాద్‌కు వస్తున్నట్లు గోపిచంద్ తెలిపారు. ప్రతి ఒక్కరు చేతులు శుభ్రం చేసుకుని, మాస్కులు ధరించాలని అభిమానులకు సూచించారు. ఆంధ్ర నుంచి తెలంగాణలోకి వచ్చే ప్రతి ప్రయాణికునికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, హోం క్వారంటైన్ ముద్రలు వేస్తున్నట్లు వైద్యారోగ్య సిబ్బంది స్పష్టం చేసింది.
ఇదీ చూడండి: కరోనాను జయించిన వారి సాయంతో వైరస్‌కు కళ్లెం!