సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం ముకుందాపురం గ్రామానికి చెందిన మీసాల పరుశరాములుకు గత నెల 20న అనారోగ్యంతో మరణించాడు. భార్య గత సంవత్సరమే చనిపోవడం వల్ల అతని ముగ్గులు ఆడపిల్లలు అనాథలు అయ్యారు.
ఆ చిన్నారులను సంపూర్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సాయం అందించాలని గ్రామస్థులు నిర్ణయించారు. సుమారు రూ. 40 వేలు విరాళాలు సేకిరించారు. ఆ ముగ్గురు పేర్ల మీద బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేయనున్నట్లు సంపూర్ణ పౌండేషన్ సభ్యులు తేలిపారు. దాతలు ముందుకొచ్చి పిల్లలకు సాయం అందించాలని గ్రామస్థులు కోరుతున్నారు.