వాయుగుండం ప్రభావంతో సూర్యాపేట జిల్లాలో కురుస్తున్న అకాల వర్షాలకు రైతన్నల కష్టం నీటిపాలవుతోంది. కోదాడ నియోజకవర్గంలో దాదాపు 1500 ఎకరాల వరిపంట నేలమట్టం అయినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. నడిగూడెం, అనంతగిరి, చిలుకూరు, మునగాల మండలాల్లో వరి పంట పూర్తిగా నీట మునగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
కొన్ని మండలాల్లో వరితో పాటు పత్తి, మిరప పంటకు నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు తక్షణమే స్పందించి పంటనష్టం వివరాలు నమోదు చేయాలని రైతులు కోరుతున్నారు. పంట చేతికొచ్చే సమయానికి నేలకొరిగిందని తమను ప్రభుత్వం ఆదుకోవాలని అన్నదాతలు విజ్ఞప్తి చేస్తున్నారు.