సమాజాన్ని తమ రాతలతో చైతన్యం దిశగా తీసుకెళ్లే పాత్రికేయుల పాత్ర కీలకమని సీఎం పీఆర్వో రమేష్ హజారి అన్నారు. సూర్యాపేట జిల్లా మద్దిరాలలోని తెరాస కార్యాలయంలో పాత్రికేయులకు నిత్యావసర సరకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతుబంధు సమితి సమన్వయకర్త రజాక్, సూర్యాపేట ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గునగంటి వెంకటేశ్వర్లు, వైస్ ఎంపీపీ బెజ్జంకి శ్రీరామ్ రెడ్డి, సీఐ రవి, ఎస్సై సాయి ప్రశాంత్, మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు కుందూరు విష్ణువర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు.
ఇదీ చూడండి: కార్మికుల సంక్షేమాన్ని ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయి: ఉత్తమ్