క్రీడా పోటీల ద్వారా టీమ్ వర్క్, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ అన్నారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రంలో దిశ్రాంత్ స్మారక రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభించారు. మారుమూల పల్లెల నుంచి నైపుణ్యం ఉన్న క్రీడాకారులను వెతికి తీసేందుకు ఇలాంటి పోటీలు ఉపయోగపడతాయని చెప్పారు.
గ్రామాల్లోని యువతకు గుర్తింపు వచ్చేందుకు క్రీడా పోటీలు తోడ్పడుతాయని గాదరి కిశోర్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్‌పర్సన్ పోతరాజు రజని, రఘునందన్‌రెడ్డి, ఆదారువు దిలీప్ తదితరులు పాల్గొన్నారు.